నయీం కేసులో నల్గొండ సీఐపై వేటు | nalgonda CI ravinder transfer on Nayeem case

Nalgonda ci ravinder transfer on nayeem case

Nalgonda CI ravinder transfer, Nayeem links with CI, Nayeem CI Ravinder, CI Ravinder in Nayeem Case

Nalgonda CI ravinder transfer on Nayeem case.

నయీం కేసులో ఫస్ట్ వికెట్ డౌన్

Posted: 08/31/2016 09:27 AM IST
Nalgonda ci ravinder transfer on nayeem case

గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో తొలి వికెట్ పడింది. నయీంతో లింకులు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కుంటున్న నల్గొండ టూటౌన్ సీఐ రవీందర్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. జిల్లా హెడ్‌క్వార్టర్స్‌కు రవీందర్ ను అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల సిట్ 'ఐ10' టీవీ చానల్ సీఈవో హరిప్రసాద్‌రెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే. నయీం గ్యాంగుకు సీఐ రవీందర్ సహకరం అందించినట్లు విచారణలో హరి చెప్పాడు. దీంతో అధికారులు సీఐపై వేటేసినట్టు తెలుస్తోంది.

ఛత్తీస్ గడ్ లోనికి చోచ్చుకెళ్లిన నయీమ్.. జేమ్స్ పేరుతో ఆగడాలు..

ఇక నయీం ప్రధాన అనుచరుల్లో ఒకడైన నల్గొండ జిల్లాకు చెందిన సంజీవరెడ్డిని మంగళవారం రాత్రి పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ సమీపంలో సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నయీంకు చెందిన వందల కోట్ల ఆస్తులకు సంజీవరెడ్డి బినామీ అని దర్యాప్తులో తేలింది. సంజీవరెడ్డి అరెస్ట్ విషయాన్ని ఇప్పటి వరకు పోలీసులు నిర్ధారించలేదు. అయితే ముత్తంగి విష్ణు లాడ్జిలో తన కొడుకుతో పాటు సంజీవరెడ్డి 204 గదిలో దిగాడని, సిట్ సిబ్బంది దాడిచేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారని లాడ్జి సిబ్బంది తెలిపారు. అలాగే భువనగిరికి చెందిన న్యాయవాది ఎంఏ రహీంను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

నట్టికుమార్ టాలీవుడ్ నయీం, బ్లూ ఫిల్మ్స్ తీసేవాడు: 

ఇక నయీం కేసులో ఇప్పటివరకూ 50 మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. గతంలో అరెస్ట్ అయిన 39మంది బంధువులు, అనుచరులు సహా మరో 11మందిని అరెస్ట్ చేసినట్లు మంగళవారం వెల్లడించారు. మాజీ మావోయిస్టు శేషన్న సహా మరో అయిదుగురు కీలక అనుచరుల కోసం గాలిస్తున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. పరారీలో ఉన్నవారు అరెస్ట్ అయితే కేసులో కీలక సమాచారంతో పాటు మరిన్ని ఆస్తులు, డంప్ దొరికే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నయీం ప్రధాన అనుచరుడు పాశం శీనును మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ కు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 3 వరకు సిట్ అధికారులు శీనును విచారించనున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayeem  Nalgonda  CI Nayeem  transfer  

Other Articles