ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ విభజిస్తే అందుకు భాజపా సహకరించిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. హోదా ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ యువత ఎలా ముందుకు వెళ్తుందని, రాయితీలు ఇవ్వకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయని పవన్ ప్రశ్నించిన ఆయన కేంద్రం ఏం చేస్తుందో చూద్దామనే రెండేళ్లు వేచి చూశానని పవన్ తెలిపారు. ప్రత్యేక హోదా డిమాండ్ కేంద్రానికి వినిపించేలా గళమెత్తాలని జనసేన నిర్ణయించిందని తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన ప్రసంగంపై అసహనం ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆయనంత రాజకీయ అనుభవం తనకు లేదని, కానీ విభజన సమయంలో ఎలాంటి పోరాటం చేశారో అలాగే ప్రస్తుతం కొనసాగించాలన్నారు. జాతి ప్రయోజనాలు వెనక్కి నెట్టే విధంగ మాట్లాడుతూ తప్పు చేస్తున్నారని పవన్ తెలిపారు. ఈ సందర్భంగా అరుణ్ జైట్లీతోపాటు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రత్యేకంపై చేస్తున్న పోరును సహేతుకంగా లేదని తప్పుబట్టారు. కేంద్రమంత్రి పదవిలో ఉన్న అశోకగజపతిరాజు బయటికి వచ్చి పోరాడాలని సూచించారు. విభజనకు మూలకారకుడైన జైరామ్ రమేష్ ను ప్రత్యేకంగా ఏస్కున్నాడు. కేంద్రం ఇంకా తెలుగు ప్రజలకు అసహనం తెప్పించే కధలు చెప్పడం మానేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా తెలుగు ఎంపీలను ఉద్దేశించి మీకు సిగ్గులేదా? పార్లమెంటును స్థంభింపజేయండని అని కాస్త ఘాటు వ్యాఖ్యలే ఆయన చేశారు.
ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా రాష్ట్రాన్ని విడగొట్టి ఇప్పటి వరకు తమ రాష్ట్రానికి ఇచ్చింది కేవలం 16,500 కోట్లా? అని ఆయన ప్రశ్నించారు. ఇలా మీరు నిధులు ఇస్తే...ఏపీ ఏనాటికి ఒక పూర్తి స్థాయి రాష్ట్రంగా తయారవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలన్నీ ఎప్పుడు జరుగుతాయని ఆయన చెప్పారు. అంకెల గారడీలు మానేయాలని ఆయన చెప్పారు. ఈ లెక్కలు తమకు చెప్పవద్దని ఆయన స్పష్టం చేశారు. అన్ని లెక్కలు కలిపితే 32 వేల కోట్లు ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.
‘ప్రత్యేకహోదా కావాలంటూ మన ఎంపీలు ఢిల్లీలో తెలుగులో అడుగుతుంటే హిందీ మాత్రమే తెలిసిన కేంద్రానికి అర్థం కావడం లేదనీ, మన ఆవేదన వారికి సరిగా చేరడం లేదంటూ’ తెలుగు, హిందీ, ఇంగ్లీషులో తెలుగువారి ఆవేదనను కేంద్రానికి అర్థమయ్యే రీతిలో తెలిపారు. మొదట తెలుగులో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ చెప్పి.. ఆ తర్వాత హిందీలో లడేంగే లడేంగే.. జీతేతక్ లడేంగే.. (పోరాడదాం.. పోరాడదాం.. సాధించే వరకూ పోరాడదాం) అంటూ పిలుపునిచ్చారు. అనంతరం ఇంగ్లీషులో మాట్లాడారు. ‘మా బాధను, కన్నీళ్లను అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు కాబట్టి మా బాధ అర్థం కావడంలేదేమో’ అంటూ ఇంగ్లీషులో ప్రసంగించారు. ప్రత్యేక హోదా మన హక్కు... తెలుగు వారి ఆత్మగౌరవం నిలబడాలంటే హోదా సాధించాల్సిందేనని పిలుపునిచ్చాడు.
హోదా కోసం జనసేన మూడు దశల్లో పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
తొలిదశ: ప్రత్యేక హోదా కోసం తొలిదశలో ప్రతీ మండలానికి వెళ్లి మనకు జరిగిన అన్యాయం ఏమిటి? ప్రత్యేకహోదా కోసం జనసేన ఏం చేయబోతోందో అనేది ప్రజలకు వివరిస్తాం. ఎక్కడైతే రాష్ట్రాన్ని విడకొట్టాలని నిర్ణయించారో ఆ కాకినాడ వేదికగానే తొలి సభ నిర్వహిస్తాం.
రెండో దశ: రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికార ఎంపీల మీద, ప్రతిపక్ష పార్టీ ఎంపీల మీద భాజాపా ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చేలా కొన్నివిధానాలు ఆవలంభిస్తాం.
తుదిదశ: ఎంపీలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇక మూడోదశను తీసుకొస్తాం. ప్రజల సహకారంతో వారి ఆలోచనలు తీసుకుని, రోడ్లపైకి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాడతాం.
పోరాటంలో భాగంగా తన తొలిఅడుగు బీజేపీ ఎక్కడైతే రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించిందో అదే కాకినాడ నడి బొడ్డు నుంచి ప్రారంభమవుతుందని, సెప్టెంబర్ 9న సభ నిర్వహించబోతున్నట్లు ప్రకటించి చివర్లో జైహింద్ అంటూ సభను వీడారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more