నయీం సినిమా ఇప్పట్లో అయ్యేలా లేదు | Naeem links with another ex minister and Film Industry

Naeem links with another ex minister and film industry

Gangster Naeem links with another ex minister, Naeem links with ministers, Naeem links with Film Industry, Naeem encounter, Naeem Dairy Secrets, Gangster naeem Movie

Gangster Naeem links with another ex minister and Film Industry.

మరో మాజీ మంత్రితో లింకులు... నయీం టోల్ ఫ్రీకి నో రెస్పాన్స్

Posted: 08/13/2016 08:46 AM IST
Naeem links with another ex minister and film industry

మాజీ నక్సలైట్, గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తో నేర సామ్రాజ్యపు పునాదులు కదులుతున్నాయి. సిట్ అధికారులు సైతం నయీం ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్క్‌ చూసి నివ్వెరపోతున్నారు. తాజాగా నార్సింగిలోని ఇంట్లోని బెడ్రూంలో దొరికిన డైరీల బూజు దులిపిన ఖాకీలకు మరో ఖద్దర్ దీని వెనక ఉన్నట్లు నిర్థారణ చేసుకన్నారు. ఇంతకు ముందు నల్గొండకు చెందిన మాజీ మంత్రి హస్తం ఉందని వార్తలు రావటం, ఆపై టీడీపీ సీనియర్ నేత ఉమామాధవరెడ్డి తమను బద్నాం చేస్తున్నారంటూ ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే.

నయీం ‘కోకోనట్’ రాసలీలు ఎంతలా అంటే...

ఈ నేపథ్యంలో గతంలో హైదరాబాదు కేంద్రంగా భూదందాలకు పాల్పడిన ఓ మాజీ మంత్రి పేరు ఇప్పుడు దొరికిన డైరీలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా నయీం తన అభిరుచులకు అనుగుణంగా కట్టించుకున్న ఫామ్ హౌస్ ను ఆనుకుని ఈ మాజీ మినిస్టర్ కూడా మరో ఫామ్ హౌస్ ను నిర్మించుకున్నారట. దీంతో పోలీసులు ఆయన వ్యవహారాలపై కూపీ లాగే పనిలో పడ్డారు సిట్ పోలీసులు. సదరు నేత ఇప్పటికే పలు పార్టీలు మారి అధికార పార్టీవైపు చూస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఈ మంత్రి ఎవరు? అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

నయీం వెనక మాజీ మంత్రి ఆయనేనా!

 

సినీ ఇండస్ట్రీతోనూ సంబంధాలు:
రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావించిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ దానికి ముందు తన జీవిత చరిత్రను సినిమా రూపంలో తెరకెక్కించే ప్రయత్నం కూడా చేశాడన్న వార్తతో సినిమా వాళ్లతోనూ నయీం లింకులు కన్ఫర్మ్ అయ్యాయి. దందాలు చేసే నయీం ఆ సినిమాలో ‘పాజిటివ్’గా చూపించుకోవాలని ఆరాటపడ్డాడని, అందుకు తెలుగు సినీ పరిశ్రమలోనూ కొందరితో సంప్రదింపులు కూడా జరిపాడని పోలీసులు చెబుతున్నారు. నయీం డైరీ(లీ) సీరియల్ లో ఇందుకు సంబంధించిన విషయాలున్నాయని వారు చెబుతున్నారు. అంతేకాదు ఏకంగా భువనగిరి అసెంబ్లీ సీటుపై కన్నేసిన నయీం ఆ సన్నాహాల్లో భాగంగానే తన సినిమానూ ప్రచారాస్త్రంగా వాడుకోవాలని భావించినట్లు తెలిసింది.

Naeem links in Tollywood

నయీం డైరీలో కీలక పేర్లు... బెడ్ రూంలో ఏముంది?

 

సిట్ దర్యాప్తు జెట్ స్పీడు:
ఇక నయీమ్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 12కేసులు నమోదవగా, 22 మందిని అరెస్టు చేశారు. నయీమ్ డైరీలో కొంత మంది అత్యున్నత స్థాయి అధికారుల కొత్త పేర్లున్నట్లు తెలుస్తోంది. నయీమ్ అనుచరులందరి వద్ద గన్స్, బుల్లెట్లు, డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలు లభిస్తున్నాయి. నయీమ్‌తో కొంత మంది బడా రాజకీయ నేతలు, పోలీసు అధికారులు దిగిన ఫోటోలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

నయీమ్ అస్తుల వివరాలతో ఖంగుతిన్న పోలీసులు 

ఇంకోవైపు నయీం బతికుండగా రియల్‌ఎస్టేట్ రంగానికి సంబంధించి బెదిరింపులకు సంబంధించి బాధితుల ఫిర్యాదు టోల్ ఫ్రీ నంబర్ కు స్పందన అంతంత మాత్రంగానే ఉంటుంది. తొలి రోజు కేవలం 14 ఫిర్యాదులు మాత్రమే రాగా, అవి అంతంత మాత్రమేనంట. ప్రభుత్వం నుంచి తగిన భరోసా కలగకపోవడం, ఈ తతంగం వెనుక ‘పెద్ద’ వ్యక్తుల పేర్లు బయటకి వస్తుండటంతో ఫిర్యాదు చేసేందుకు వణికి పోతున్నట్లు చెబుతున్నారు. కాగా, నయీం దందాలపై సమాచారం అందించాల్సిందిగా 9440627218 టోల్ ఫ్రీ నంబర్ ను కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ చీఫ్ వై.నాగిరెడ్డి స్వయంగా ప్రకటించిన విషయం విదితమే.

కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ నే టార్గెట్ చేశాడా???

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gangster Naeem  Dairy  Movie  

Other Articles