గ్యాంగ్ స్టర్ నయీం వెనక నల్గొండ మాజీ మంత్రి | nalgonda ex minster behind gangster Naeem

Nalgonda ex minster behind gangster naeem

Nalgonda Ex minister, Naeem political support, Naeem political Support, Minister in Naeem case, Naeem minister, Naeem encounter

Nalgonda Ex minister behind Gangster Naeem. Support and giving shelter.

నయీం వెనక మాజీ మంత్రి ఆయనేనా!

Posted: 08/11/2016 09:30 AM IST
Nalgonda ex minster behind gangster naeem

గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తులు, గ్యాంగ్ ను అతడు నడిపిన తీరుపై ఆసక్తికర కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మరింత కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలున్నాయి. నయీం కు ఆశ్రయం కల్పించడమే కాదు ... అతడు గ్యాంగ్ స్టర్ గా మారేందుకు తోడ్పాటునందించిన ఓ రాజకీయ నేత తెరపైకి వచ్చారు. నయీం సొంత జిల్లా నల్లగొండ జిల్లాకే చెందిన సదరు రాజకీయవేత్త పేరు బయటకు రాకున్నా.. ఈ కోణంపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు ప్రచురితమతున్నాయి.

నయీం వెనక మాజీ మంత్రి ఆయనేనా!

నయీం కు అండగా నిలిచిన సదరు నేత గతంలో మంత్రిగానూ పనిచేశారట. ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి చేరేందుకు అవకాశం కోసం ఆయన ఎదురుచూస్తున్నారట. మావోయిస్టుల చేతిలో తన కుటుంబ సభ్యుడిని కోల్పోయిన సదరు మాజీ మంత్రి, వారిపై కక్ష తీర్చుకునే క్రమంలోనే నయీం ను వాడుకున్నట్లు పోలీసులకు పక్కా ఆధారాలు లభించాయి. మొదట్లో చాలా కాలం పాటు నయీం ఆ నేత ఇంటిలోనే ఉన్నాడంట. ఈ క్రమంలో మావోయిస్టులతో పాటు పౌర హక్కుల సంఘం నేతలను మట్టుబెట్టించడంలోనూ ఆ నేత కీలక భూమిక పోషించారట.

నయీమ్ అస్తుల వివరాలతో ఖంగుతిన్న పోలీసులు

తాజాగా రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి, సదరు స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫునే బరిలోకి దిగేందుకు యత్నించారన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాలోని ఓ ఎమ్మెల్యేపై నయీమ్ భారీ స్థాయిలో బెదిరింపులకు దిగాడు.

కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ నే టార్గెట్ చేశాడా???

హైదరాబాదులోని అల్కాపురిలోని నయీం ఇంటిలోని అతడి బెడ్ రూం తలుపులను బద్దలుకొట్టిన పోలీసులు ఈ మేరకు పక్కా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. నయీమ్ ఎక్కువ సార్లు ఫోన్ చేసింది కూడా సదరు లీడరేనని తెలుస్తోంది. మాజీ మంత్రి సెల్ ఫోన్ కే కాకుండా... ఆయన గారి ఇంటిలోని ల్యాండ్ లైన్ కు కూడా నయీం చాలాసార్లు ఫోన్ చేశాడట. ఈ క్రమంలో ఈ కేసులో సదరు మాజీ మంత్రినే ఏ1గా చేర్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే... నయీం అనుచరవర్గంలోని వారంతా సదరు నేత అనుచరవర్గంలోని వారేనన్న విషయాన్ని కూడా పోలీసులు దాదాపుగా నిర్ధారించుకుంచి ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం.

Related Articles:-

నయీం డైరీలో కీలక పేర్లు... బెడ్ రూంలో ఏముంది?

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gangster  naeem  Encounter  politician  minister  support  

Other Articles