బికినీలో వస్తే ఫ్రీ పెట్రోల్ | Petrol station offers free fuel for bikini in Russia

Petrol station offers free fuel for bikini in russia

Petrol for bikini, Free petrol for Bikini in russia, Russia petrol bunk offer, Free petrol bikini, Bikini for Petrol, Man in Bikini, Man in Bikini for petrol, men in bikini for petrol

Petrol station offers free fuel for bikini in Russia.

బికినీలో వస్తే ఫ్రీ పెట్రోల్... కానీ, ఊహించని ట్విస్ట్

Posted: 08/04/2016 01:43 PM IST
Petrol station offers free fuel for bikini in russia

ఫ్రీ ఈ ఒక్క పదం మనిషిని ఎక్కడికైనా, ఏం చేయడానికైనా ఉసిగొల్పుతోంది. పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న ఈ సమయంలో ఫ్రీ పెట్రోల్ సరఫరా చేస్తామంటే ఎవరైనా ఊరుకుంటారా? క్యూ కట్టేయరు. కానీ, బిజినెస్ ఐడియా అంటూ రష్యాలోని ఒబ్లాస్ట్‌ లో ప్రారంభమైన పెట్రోల్‌ బంక్‌ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

బికినీ, హైహీల్స్ వేసుకుని వచ్చిన వారికి జూలై 21న మూడు గంటపాటు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ లేదా డీజిల్ ఫ్రీ అని ప్రకటించింది. తాము ప్రకటించిన సమయంలో బికినీలో వచ్చిన వారు తమను అడగాల్సిన అవసరం లేదని, నేరుగా పెట్రోలు, డీజిల్ నింపుకుని వెళ్లిపోవచ్చని ప్రకటించింది. అంతే... బికినీలు వేసుకుని కార్లలో వచ్చిన వినియోగదారులు అక్కడ క్యూకట్టేశారు.

అయితే ఇలాంటి ఆఫర్లు పెట్టి విఫలమైన సందర్భాలు లేవనే చెప్పాలి. అయితే బికినీలో రండి... ఫ్రీ పెట్రోల్ పొందండి అనే నినాదాన్ని ఒంటపట్టిచ్చుకున్న పురుష పుంగవులు కూడా తామేం తక్కువ కాదంటూ బికినీలో వచ్చి ఫ్రీ పెట్రోల్ కొట్టుకెళ్లిపోయారు.

bikini man for petrol

man for petrol in bikini

క్యూ మొత్తం బికినీ బేబ్స్ తో నిండిపోయి ఫ్రీ పబ్లిసిటీ దొరకుతుందనుకున్న బంక్ యజమాని అది చూసి ఆశ్చర్యపోయాడు. మగాళ్లు కూడా బికినీ, హైహీల్స్ వేసుకుని పెట్రోల్ నింపుకుంటుంటే అతని గుండెలు బద్ధలు కావా?. దాదాపు మూడు గంటలపాటు ఆడా, మగా అన్న తేడా లేకుండా బికినీలో వచ్చి ఫ్రీ పెట్రోల్ ను పట్టుకెళ్లిపోయారంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Russia  Petrol  Bikini  free offer  

Other Articles