రాజ్యసభకు సెలవుతో హోదా అటకెక్కినట్లేనా? | holiday effect on AP special status discussion in RS

Holiday effect on ap special status discussion in rs

Teej festival effect on RS, Rajya Sabha special status discussion, AP special status, KVP bill kill in Rajya Sabha

Holiday effect on AP special status discussion in RS. Teej effect on AP special status.

రేపు మిస్సయితే హోదా ఇక అంతే!

Posted: 08/04/2016 12:33 PM IST
Holiday effect on ap special status discussion in rs

ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు పై రేపు రాజ్యసభలో చర్చ, ఓటింగ్ జరుగుతుందని భావిస్తున్న తరుణంలో ఓవార్త కలవరపెడుతోంది. శుక్రవారం రాజ్యసభకు సెలవు ప్రకటించే అవకాశం ఉండటంతో ఇక హోదా అంశం కోల్డ్ స్టోరేజీకి చేరినట్లేనని అంటున్నారు.

సాధారణంగా ప్రైవేటు మెంబర్ బిల్లులను ప్రతి రెండో శుక్రవారం సభలో ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో 12 రోజుల క్రితం రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరిగింది. అయితే తీవ్ర గందరగోళం నడుమ నాటి సభ వాయిదా పడగా, జూలై 5న చర్చిస్తామని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ హామీ ఇచ్చారు. అయితే రేపు ఉత్తరాదిన 'తీజ్' పండగ ఉంది. అదే సమయంలో దక్షిణాన తొలి శ్రావణ శుక్రవారం ఉంది. దీంతో సెలవు ప్రకటించాలని మెజార్టీ ఎంపీలు కోరుతున్నారంట.

ఒకవేళ దానికి స్పీకర్ సానుకూలంగా స్పందిస్తే మాత్రం ప్రత్యేక హోదా అంశంపై చర్చ అటకెక్కినట్లేనని భావించవచ్చు. ఎందుకంటే వచ్చే వారం దాకా రాజ్యసభ ఉండదు. అదే జరిగితే వచ్చే పార్లమెంట్ సమావేశాల దాకా ప్రత్యేక హోదా కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajya Sabha  AP special status bill  holiday  

Other Articles