అత్యాచారాలకు కేరాఫ్ అడ్రెస్ ఉత్తరప్రదేశ్ అన్నది ఈ మధ్య జరుగుతున్న వరుస ఉదంతాలే చెబుతున్నాయి. అయితే అంతకంటే దారుణమైన విషయం ఒకటి ఇప్పుడు బయటపడింది. రేప్ లను వీడియో తీసి ఆనందించే పిశాచాలు వాటిని అమ్మకానికి పెడుతుండటం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ఒంటరిగా ఉన్న మహిళలు, బాలికలపై మృగాళ్లా విరుచుకుపడుతు బలత్కారానికి పాల్పడటమే కాదు, ఆ దుర్మార్గాలను సెల్ ఫోన్లలో కూడా చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత సదరు వీడియోలను వారు నేరుగా మొబైల్ షాపులకు అందజేస్తున్నారు. ఇక సదరు మొబైల్ షాపు యజమానులు వాటిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. 30 సెకన్ల పాటు ఉండే వీడియోను రూ.50 కు విక్రయిస్తున్న దుర్మార్గులు... 5 నిమిషాల నిడివి ఉన్న వీడియోను కేవలం రూ.150 కు విక్రయిస్తున్నారు. ఈ దందా మొత్తం బహిరంగంగానే జరుగుతున్నా... పోలీసులు కానీ, అధికార యంత్రాంగం కానీ దీనిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
అత్యంత క్రూరమైన లైంగిక దాడులకు సంబంధించిన నేరాల వీడియోలు రోజూ వందలు, వేలల్లో విక్రయమైపోతున్నాయి. అయితే ఇది ఒక్క యూపీలోనే కాదని, దేశం మొత్తం ఇలాంటి దందాలు జరుగుతూనే ఉంటాయని మాజీ పోలీస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం విశేషం. రేప్ ఘటనలకు చెందిన ఈ వీడియోలను వాటి నిడివిని ఆధారం చేసుకుని రేటు నిర్ణయించే ముఠాలను గతంలో పట్టుకున్న దాఖలాలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు.
లైంగిక దాడి చేస్తుండగా చిత్రీకరించి ఆపై వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేయటంతో నిందితులు ఆగుతారనుకుంటే పొరపాటే, ఇలాంటి ఘటనల్లో ఆ వీడియోలన్నీ దాదాపుగా బయటికి వచ్చేవే ఉంటాయని మరో సీనియర్ అధికారి చెబుతున్నాడు. ముంబై, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నప్పుడు సినిమా పైరసీ, నీలి చిత్రాలకు సంబంధించిన వాటితోపాటు ఇలాంటి అత్యాచారా వీడియోలు కూడా చాలానే వెలుగు చూశాయని ఆయన వివరించాడు.
ఇలా వీడియోలు బయటికి రావటంతో ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటం కలవరపాటుకు గురిచేసేదే. రేప్ కన్నా దారుణమైన ఈ దాష్టీకాలపై ప్రస్తుతం జాతీయ మీడియాల్లో ప్రత్యేక కథనాలు వెలుగు చూస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more