Allu Arjun announces he is becoming dad again

Look at this beautiful moment from the allu family

Allu Arjun, Allu Sneha reddy, Allu Ayaan, allu arujn family photo, allu arjun another baby, tollywood, allu aravind, stylish star allu arjun, Allu Arjun, Allu Arjun wife sneha reddy, tollywood news, telugu news

tollywood stylish star Allu Arjun will be welcoming second baby into their family. Recently his wife was spotted with baby bump at Haritha Haram event. Since then media has been speculating about this.

అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న స్టైలిష్ స్టార్..

Posted: 07/20/2016 06:59 PM IST
Look at this beautiful moment from the allu family

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులకు మరో శుభవార్తను చెప్పాడు. ఇదేంటి మొన్నే కదా సరైనోడు చిత్రం రిలీజ్ అయ్యింది. బంపర్ హిట్ కూడా అయ్యింది. అయితే తన కొత్త ప్రాజెక్టు గురించేమైనా గుడ్ న్యూస్ చెబుతున్నారా..? అంటారా.? కాదండీ ఇది ఎక్స్ ట్రమీల్నీ స్పెషల్ న్యూస్. ఈ ప్రత్యేక వార్తతో ఆయన కుటుంబంతో పాటు అభిమానులకు కూడా ఫుల్ గా థ్రిల్ అవుతున్నారు. అంత స్పెషల్ న్యూస్ ఏంటంటారా..? ఆయన ట్విట్టర్ లో పోస్టు చేసిన ఈ ఫోటోనూ చూస్తే.. అయన చెప్పకుండానే అందరికీ గుడ్ న్యూస్ అర్థమైపోతుంది. అంత అరుదైన పిక్ ను తన అకౌంట్ లో పోస్టు చేసి అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకున్నారు అల్లు వారబ్బాయి.

ఇంతకీ ఈ ఫోటో ఏంటంటారా..? ఈ ఫొటోలో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి, వారి ముద్దుల కొడుకు అల్లు అయాన్ ఉన్నారు. అల్లు అర్జున్, అయాన్ ను ఎత్తుకుని ఉండగా, ఆ చిన్నారి తన తల్లి స్నేహా రెడ్డి గర్భంలో ఉన్న సోదరుడు/సోదరిని ముద్దాడుతున్నాడు. అర్థమైందా..? ఈ చిత్రంతో త్వరలో అల్లు వారింట మరో బేబి పాదం మోపనుంది. నడియాడనుంది. ‘‘మా ఇంట్లోకి త్వరలోనే మరో బేబి వస్తుందం’’టూ  ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిల పరిణయం ప్రణయ పరిణయమన్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles