Young Indian cricketer Karun Nair rescued as boat capsizes

Close shave for cricketer karun nair as boat capsizes

karun nair, nair, karun ,kerala, snake baot, pampa, valla sadya, sree parthasarathy temple, Aranmula Police station, sports, india

Karun Nair along with the others were taking part had a narrow escape as the snake boat in which they were travelling capsized in river Pampa.

తృటిలో తప్పించుకున్న టీమిండియా యువ క్రికెటర్

Posted: 07/18/2016 04:55 PM IST
Close shave for cricketer karun nair as boat capsizes

భారత యువ క్రికెటర్, కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్కు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇదే ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తుల అచూకీ గల్లంతయ్యింది. కేరళలోని పంపా నదిలో ఆయన ప్రయాణిస్తున్న స్నేక్ బోట్లో తిరగబడింది. ఆ పడవలో ప్రయాణిస్తున్న కరుణ్ నాయర్తో పాటు పలువురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఇద్దరు యువకుల అచూకీ ఇప్పటికీ లభించలేదు.

కేరళ రాష్ట్రంలోని కేరళ జిల్లాలో నెలకోన్న శ్రీ పార్థసారధి ఆలయంలో నిర్వహించే వాల్లా సద్యా ఉత్సవానికి హజరయ్యేందుకు కరుణా నాయర్ వెళ్తున్నారు. ఆయనతో పాటు సుమారు 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ అదుపుతప్పి తల్లక్రిందులైంది. పడవ ప్రమాదం సంభవించిన వెంటనే అక్కడ ఉన్న రెస్క్యూ సిబ్బంది అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది, కాగా ఇద్దరు యువకుల అచూకీ మాత్రం గల్లంతయ్యిందని అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదం సంభవిచినప్పుడు యువ క్రికెటర్ కరుణ్ నాయర్ పడవలోనే ప్రయాణిస్తున్నట్లు అరన్ ముల్లా పోలిస్ స్టేషన్ కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయనతో పాటు ప్రయాణికులందర్నీ సురక్షింతంగా కాపాడినట్లు చెప్పిన అధికారులు.. ఇద్దరు యువకుల అచూకీ లభ్యంకాలేదని తెలిపారు. ఆ ఇద్దరి ఆచూకీ గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇటీవల జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టులో కరుణ్ నాయర్ కు స్థానం కల్పించగా, వెస్టిండీస్ టూర్ నుంచి ఆ క్రికెటర్కు విశ్రాంతినిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karun Nair  boat accident  indian cricketer  river Pampa  

Other Articles