హవ్వా... గవర్నర్ భార్య అయి ఉండి ఇలానా? | Maine Gov wife Ann LePage become waitress for buying car

Maine gov wife ann lepage become waitress for buying car

Maine Governor LePage, LePage wife Ann LePage, governor wife turns waitress

Maine Governor LePage wife Ann LePage become waitress for buying car.

ITEMVIDEOS:హవ్వా... గవర్నర్ భార్య అయి ఉండి ఇలానా?

Posted: 07/06/2016 09:38 AM IST
Maine gov wife ann lepage become waitress for buying car

అధికారంలో ఉన్నవారు ఆ అండతో ఫ్రీగా సకల సౌకర్యాలు అనుభవిస్తుంటారు. అంతేనా ఓ మెట్టు దిగి అవినీతితో అక్రమ సొమ్మును మూటగట్టుకోని విలాసాలవంతమైన జీవితాలను అనుభవిస్తారు. అలాంటి మహానుభావులున్న ఈ భూమ్మీద ఇంకా టూమచ్ నిజాయితీ పరులు ఉన్నారంటే ఒకింత ఆశ్చర్యపోవాల్సిందే... ఆమె పేరు అన్ లేపేజ్... మైనే రాష్ట్ర గవర్నర్ పాల్ లెపేజ్ భార్య. అంటే రాష్ట్రానికి ప్రథమ పౌరురాలు. కానీ, ఆమె ఏం చేస్తుందో చూడండి.

ప్రస్తుతం ఆమె ఇప్పుడు ఓ హోటల్ లో వెయిటర్ గా పని చేస్తోంది. అక్కడికి వచ్చే వారిని నవ్వుతూ పలకరిస్తూ, ఆర్డర్ లు తీసుకోవటంతోపాటు ఎంగిలి ప్లేట్లు ఎత్తుతోంది. ఆమెకు అంత కర్మ ఏంటంటారా? ఆమెకు కారు కొనుక్కోవాలనే కోరిక బలంగా ఉందంట. అదేంటీ గవర్నర్ తలుచుకుంటే కారుకు కొదవ అనుకోవచ్చు. కానీ, ఇక్కడ ఓ ప్ర్యతేకత ఉంది. అమెరికాలోనే అత్యంత అల్ప జీతం తీసుకునే గవర్నర్ గా పాల్ లోపేజ్ రికార్డులోకి ఎక్కారు. ఆయనకు వచ్చేదాంట్లో మెజారిటీ వాటాను దానధర్మాలకు, సేవా కార్యక్రమాలకు ఆయన వినియోగిస్తుంటారంట.

దీంతో తన భర్తకు కారు కొనే స్తోమత లేకపోవటంతోనే తాను ఇలా వెయిటర్ గా పని చేస్తున్నా అంటోంది అన్ లోపేజ్. అంతేకాదు ఆ డబ్బుతోనే కారు కొనాలన్న కోరికను తీర్చుకుంటానని చెబుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎలాగో అలా డ‌బ్బు సంపాదించేసి, రాజ‌భోగాలు అనుభ‌వించేద్దాం అనుకునే అధికారుల భార్యలు, వారి కుటుంబ స‌భ్యులు ఉన్న స‌మాజంలో ఆదర్శ భావాలతో ఆమె చేస్తున్న పనిని ఎందరిలో స్ఫూర్తి నింపుతుందంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US  Maine Governor  LePage  Ann LePage  waitress  

Other Articles