ఐఐటీ గ్రాడ్యుయేట్, క్యాబ్ డ్రైవర్ గా... షాకింగ్ స్టోరీ | Why IIT Graduate become Cab Driver in Bengaluru

Why iit graduate become cab driver in bengaluru

IIT Graduate Anand ji story, IIT Graduate becomes cab driver, Bengaluru cab Driver Real Story, Shrikant Singh post on cab driver

IIT Graduate Anand ji Now doing work as Cab Driver in Bengaluru. Story Posted in Shrikant Singh facebook and goes Viral.

ఐఐటీ గ్రాడ్యుయేట్, క్యాబ్ డ్రైవర్ గా... షాకింగ్ స్టోరీ

Posted: 07/06/2016 10:59 AM IST
Why iit graduate become cab driver in bengaluru

ఓడలు బండ్లు, బండ్లు ఓడలవ్వటం సామెత ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. పరిస్థితులు పగబట్టో, లేక అదృష్టం వెక్కిరించో దరిద్ర్య దేవిని కౌగిలించుకున్న వారి కథలు మనం కోకోల్లలు విన్నాం. కానీ, ఇక్కడ మనం చదవబోయింది అందుకు విరుద్ధమైన గాథ. చదివితే ఆదర్శంగా అనిపించడంతోపాటు చిన్నగా మీకూ కళ్లు చెమ్మగిల్లి, ఆపై చివర్లో పెదవిపై ఓ చిరునవ్వు కూడా వస్తుంది.
 
అతనో ఐఐటీ గ్యాడ్యుయేట్. మధ్య వయస్కుడు. 30 ఏళ్లుగా పెద్ద పెద్ద కంపెనీల్లో లక్షల జీతానికి పని చేస్తున్నాడు. పైగా ఇప్పుడు ఉబెర్ తో భాగస్వామిగా మారి ఓ యాభై కార్లను నడుపుతున్నాడు కూడా. పైపెచ్చు మైసూర్ లో రెండు స్ట్రా బెర్రీ ఫామ్ లు కూడా ఉన్నాయి. కానీ, ప్రస్తుతం అతను ఓ టాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. దానికి కారణం అతని పరిస్థితి బాగోలేకపోవటం కాదు. అయినా ఆ పనినే చేస్తున్నాడు. నమ్మలేని ఈ నిజం, తనకు ఎదురైన ఈ అనుభవం గురించి బెంగళూర్ కు చెందిన  ఓ వ్యక్తి పోస్ట్ చేసిన కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ గా నిలుస్తోంది.

బెంగళూర్ కు చెందిన శ్రీకాంత్ సింగ్ ఎప్పటి లాగే ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాడు. లేట్ నైట్ కావటంతో ఓ క్యాబ్ ను బుక్ చేసుకున్నాడు. ఇక ఆఫీస్ చికాకులో ఉన్న అతన్నీ క్యాబ్ డ్రైవర్ ఆనంద్ జీ పలకరించాడు. వారిద్ధరి మధ్య సంభాషణ ఎలా ఉందో చూడండి...

ఆనంద్(క్యాబ్ డ్రైవర్): ఏంటీ సార్ ఈరోజు ఎలా గడిచింది (అనర్గళమైన ఆంగ్లంలో తప్పులేకుండా మాట్లాడటంతో శ్రీకాంత్ షాక్ తిన్నాడు)
శ్రీకాంత్: ఏదో సార్ బాగానే గడిచింది(షాక్ తోనే...) ఆపై కొన్ని ఫోన్లు కాల్స్ ని మాట్లాడి మళ్లీ చికాకు మొహం పెట్టేశాడు.
ఆనంద్ : ఈ ఈ-కామర్స్ ఇంకేలా ఇలా ఉండబోతుందంటారు?
శ్రీకాంత్ :  (మరోసారి షాక్ అయ్యి...) ఏమో సార్ నా సమస్యలతోనే నేను సతమతమవుతున్న అని బదులిచ్చాడు.
శ్రీకాంత్ : అంతటితో ఆపకుండా... సార్ మిమల్ని చూస్తుంటే మాములు క్యాబ్ డ్రైవర్ లా కనిపించడం లేదు అని అడిగాడు.          
ఆనంద్: సార్ నేను 1986లో ఐఐటీ నుంచి గ్రాడ్యేయేట్ పూర్తి చేశాను. ముప్పై ఏళ్లుగా పెద్ద కంపెనీల్లో పని చేశాను. ఉబెర్ తో కలిసి ఓ యాభై టాక్సీలను నడుపుతున్నాను. మైసూర్ లో రెండు ఫామ్ హౌస్ లు కూడా ఉన్నాయి అంటూ చెప్పుకోచ్చాడు.
శ్రీకాంత్  మరి ఈ క్యాబ్ డ్రైవర్ అవతారమేంటి సార్(ఆశ్చర్యంతో కూడిన స్వరంతో...)
ఆనంద్(ఐఐటీ గ్రాడ్యుయేట్): కొనాళ్ల క్రితం ఈ కారు డ్రైవర్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అతని కుటుంబానికి నేను డబ్బు సాయం చేయబోతే వాళ్లు తీసుకోలేదు. అందుకే ఇలా డ్రైవర్ గా మారి ఆ సొమ్మును వారి కుటుంబానికి పంపిస్తున్నా... ఇందుకు నేనేం సిగ్గుపడటం లేదు, చాలా సంతోషంగా ఉంది అని వివరించాడు.

ఇదంతా విన్న శ్రీకాంత్ కు తనకు తెలీకుండానే కళ్లోంచి నీళ్లు తన్నుకోచ్చాయి. మనల్ని నమ్మి పని చేసే వారి నమ్మకం చురగొనటం కంటే అంతకు మించిన విజయం ఇంకోటి ఉండదనే విషయాన్ని అందరూ గుర్తిస్తే ఎంత బావుంటుందో కదా. జూలై 2న పోస్ట్ చేసిన దీనికి ప్రస్తుతం 71 వేల లైకులు, 11 వేల షేరులు, 123 కామెంట్లు వచ్చాయి. ఆసక్తికరమైన ఈ గాథని మీరు చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : Bengaluru  IIT Graduate  Anand Ji  Uber Cab Driver  Shrikant Singh  Facebook  

Other Articles