తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ | Aarogyasri services stopped due to pending bills in telangana

Arogyasri services stopped due to pending bills in telangana

telagana Aarogyasri, Aarogyasri Services pending bills in telangana,

Private hoospital associations in the state called to stop Aarogyasri Services demanding government to release pending bills.

ITEMVIDEOS: తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్

Posted: 06/30/2016 05:52 PM IST
Arogyasri services stopped due to pending bills in telangana

తెలంగాణా రాష్ట్రంలో రేపటి నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఇన్నాళ్లు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు చేసిన చికిత్సకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను చెల్లించపోకపోవటంతో యాజమాన్యాలు నిరసనకు దిగాయి. మే నెలలోనే సేవలను నిలిపివేస్తామని హెచ్చరించినప్పటికీ అప్పుడు జరిగిన చర్చలతో ప్రభుత్వం కాస్త గడువు కోరింది. నెలరోజులు గడుస్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవటంతో ఈరోజు అర్థరాత్రి నుంచి సేవలు నిలిపివేయనుంది.

ప్రభుత్వం నుంచి 300 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉండగా, కేవలం 40 కోట్లు మాత్రమే విడుదల చేశాయని ప్రైవేట్ ఆస్పత్రు యాజమాన్యాలు చెబుతున్నాయి. పూర్తి బకాయిలు చెల్లించేంత వరకు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని పేర్కొన్నారు. అయితే సాంకేతిక సమస్యల వల్లే బిల్లుల చెల్లింపులో కాస్త ఆలస్యం జరిగిందని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ చెబుతోంది.

ఇటీవల ఆరోగ్యశ్రీ బకాయిల కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. అయినా పూర్తి స్థాయిలో విడుదల చేయాలన్నదే యాజమాన్యాల డిమాండ్. బిల్లు బ‌కాయిల వ‌ల్ల ఆస్పత్రులు స‌క్ర‌మంగా న‌డిపే ప‌రిస్థితి లేదని వారు వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telagana  Aarogyasri  Private hoospital associations  

Other Articles