షాక్: కాస్తుంటే ఈ శనివారం పేలుళ్లే... | ISIS terrorists Targets Hyderabad Temples

Shocking facts in nia enquiry to isis terrorists targets hyderabad

ISIS terrorists hyderabad, Hyderabad Temples ISIS, ISIS target hyderabad, Five Islamic State members arrested in hyderabad, shocking facts in NIA enquiry

ISIS terrorists Targets Hyderabad Temples.Five Hyderabad module members of Islamic State have been put formally under arrest by NIA

ITEMVIDEOS: షాక్: ఈ శనివారం పేలుళ్లతో దద్దరిల్లేదే!.

Posted: 06/30/2016 06:41 PM IST
Shocking facts in nia enquiry to isis terrorists targets hyderabad

భారీ మారణహోమం నుంచి భాగ్యనగర వాసులు తప్పించుకున్నారు. ఎడతెరిపి లేకుండా రెండు రోజులుగా సాగుతున్న ఎన్ఐఏ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ శనివారమే పలు రద్దీ ప్రాంతాల్లో బాంబు దాడులు, కాల్పుల పర్వానికి దిగేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారంట. సికింద్రాబాద్, పాతబస్తీలోని ఆలయాలే టార్గెట్ గా ఈ దాడులు చేయాలని వారి ఫ్లాన్ అని తెలుస్తోంది.

గురువారం కూడా కొనసాగిన విచారణలో సంచలన విషయాలను వెల్లడించారు. మొత్తం పదుకొండు మందిలో ఆరుగురు ఈ మధ్యే రిక్రూట్ అయిన వారు కావటంతో వారిని వదిలేసిన పోలీసులు, మిగతా ఐదుగురు ఉగ్రవాదులను కోర్టులో హాజరు పరిచి అనంతరం రెండు వారాల రిమాండ్ తో చంచల్ గూడ జైలుకు తరలించారు. షఫి కీలక సూత్రధారి కాగా, హబీబ్, ఇబ్రహీం యజ్జానీలతోపాటు మరో ఇద్దరు కీలక నిందితులుగా ఉన్నారు.

అంతేకాదు ఓ పోలీస్ స్టేషన్ తోపాటు అమీర్ పేట్ బిగ్ బజార్, గచ్చిబౌలిలోని పలు ఐటీ కంపెనీలు, ప్రసాధ్ ఐమాక్స్, ఆల్ఫా హోటల్ దగ్గర రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలింది. ప్రధానంగా పాత బస్తీలో విధ్వంసం.సృష్టించడం వీరి టార్గెట్ గా తెలిసింది. కర్ణాటకకు చెందిన భత్కాల్ సూచనల ఆధారంగా వీరు పక్కా ప్రణాళిక రచించినట్లు సమాచారం. బాంబుల తయారీకి సిరియాలోని షరీ ఆర్మీ సాయం తీసుకున్నారంట.  

వాటిని పెయింట్ డబ్బాల్లో అమర్చి రద్దీ ప్రదేశాల్లో ఉంచి పేలుళ్లు జరపాలన్నదే ప్లాన్. అంతటితో ఆగకుండా వెంటనే విచక్షణా రహితంగా కాల్పులు జరిపేందుకు తుపాకులు కూడా సిద్ధం చేసుకున్నారంట. ఆన్ లైన్ కాల్స్. సోషల్ నెట్ వర్క్ లో టచ్ లో ఉన్న వీరిపై నిఘా వర్గాలు కన్నేసి ఉంచటంతో ఈ విషయాలన్నీ వెలుగు చూసి భారీ దాడి నుంచి తప్పించుకోగలిగాం. లేకుంటే నగరం మొత్తం శ్మశానంగా మారి ఉండేదేమో.

భాస్కర్   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS terrorists  hyderabad  temples  

Other Articles