మైనర్ కోడలితో చిక్కుల్లో బీజేపీ నేత | BJP chief trouble with minor daughter in law

Bjp chief trouble with minor daughter in law

Jharkhand BJP chief Tala Marandi, BJP son daughter in law minor,

Jharkhand BJP chief Tala Marandi’s son Munna Marandi has allegedly married a minor girl. Earlier on Wednesday, another minor girl had also accused him of sexual abuse.

చిన్నారి పెళ్లి కూతురుతో నేతకు చిక్కులు

Posted: 06/30/2016 03:56 PM IST
Bjp chief trouble with minor daughter in law

సొంత నేతల వ్యవహారం బీజేపీకి చిక్కులు తెచ్చిపెట్టడం కొత్తేమీ కాదు. అయినప్పటికీ పార్టీ చీఫ్ అయి ఉండి చేసిన పాడు పనికి ఇప్పుడు అనుభవిస్తున్నాడు జార్ఖండ్ బీజేపీ నేత తలా మారండి. ఓ మైనర్ బాలికతో ఈయనగారు వెలగబెట్టిన వ్యవహారంపై అక్షింతలు పడుతున్నాయి.

ఇంతకీ ఆయనేం చేశారనేగా... తన కొడుక్కి 11 ఏళ్ల బాలికతో ఆయన వివాహం చేశారంట. నయాదునియా.జగ్రాణ్.కామ్ అనే పత్రికా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. రెండు రోజుల క్రితం నిండా 11 ఏళ్లు కూడా లేని బాలికను తన కొడుకు మున్నా రాండికి ఇచ్చి వివాహం చేశాడని దాని సారాంశం. విషయం తెలుసుకున్న మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారి విచారణ చేపట్టగా అది నిజమని తేలింది.

Tala Marandi son Munna Marandi

ఆ బాలిక స్కూల్ రికార్డులను పరిశీలించగా... 2005, జూలై 25న ఆ బాలిక జన్మించిందని తేలింది. అయితే గత రెండేళ్లుగా బాలికపై మున్నా లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, ఆ ఆరోపణల నేపథ్యంలోనే గుట్టుచప్పుడు కాకుండా ఈ పెళ్లి చేశారని విమర్శ వినిపిస్తోంది. అంతేకాదు గతంలోనూ ఇంకో మైనర్ పైనా మున్నా లైంగిక దాడి చేశాడనే ఆరోపణ ఉంది. ప్రతిపక్ష నేత శిబూ సోరెన్ దీనిపై స్పందిస్తూ పెళ్లి కార్డులో వేరే పేరు ఉండి, బాలిక అసలు పేరు ఉండటం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ నెల 29న ఏర్పాటు చేసిన రిసెప్షన్ ను అర్థాంతరంగా రద్దు చేయటం వెనుక ఉద్దేశం ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. సిట్ తో ప్రత్యేక విచారణ జరిపించాలని మరో పార్టీ జార్ఖండ్ వికాస్ మోర్చా డిమాండ్ చేస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ చీఫ్ పదవికి తలా మారండి రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jharkhand BJP  Tala Marandi  Munna Marandi  

Other Articles