ఇదోక విచిత్రమైన కేసు... మీరూ చదవండి | officials 30 days notice to cat vacate the library premises

Officials 30 days notice to cat vacate the library premises

officials 30 days notice to cat, cat vacate the library premises, notice to a cat, పిల్లికి నోటీసులు, మార్జాలానికి మాటోస్తే, తాజా వార్తలు, తెలుగు వార్తలు, మార్జాలానికి నోటీసు

Officials 30 days notice to cat vacate the library premises inTexas. City council has voted in favour of evicting a beloved cat living in a public library for nearly six years, giving the feline 30 days notice to vacate the premises.

ఇదోక విచిత్రమైన కేసు... మీరూ చదవండి

Posted: 06/29/2016 05:08 PM IST
Officials 30 days notice to cat vacate the library premises

తానోక మూగజీవినని, తన జోలికి ఎవరూ రారని భావించిన ఆ మార్జాలానికి అదేనండీ పిల్లికి పెద్ద షాకే ఇచ్చారు అధికారులు. గుట్టు చప్పుడు కాకుండా ఆరేళ్ల నుంచి తాను ఉంటున్న నివాసం నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకాలం మనుషులకే పరిమితమైన నోటీసులను మూగజీవాలకు కూడా పంపే కొత్త సాంప్రదాయానికి తెరలేపారు టెక్సాస్ అధికారులు.

స్థానికంగా ఉండే ఓ లైబ్రెరీలో బ్రౌజర్ అనే పిల్లి ఆరేళ్లుగా జీవిస్తోంది. ఓ జంతు సంరక్షణ కేంద్రం నుంచి దత్తత తీసుకోచ్చి మరీ ఇక్కడ దీనిని పెంచుతున్నారు. లైబ్రరీకి వచ్చే వాళ్లందరికీ ఇది మంచి ఫ్రెండ్ కూడా. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తన మానాన తాను హ్యాపీగా బతుకుతుంది ఇది. అయితే ఇప్పుడు దీనిని వెల్లగొట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారు.

అది అటు ఇటు తిరుగుతుంటే తమకు ఇబ్బంది కలిగిస్తుందని కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో దీన్ని ఉంచాలా, పంపించేయాలా అని లైబ్రరీ నిర్వాహకులు రెఫరెండం నిర్వహించారు. అయితే ఓటింగ్ లో కూడా బ్రౌజర్ కు నిరాశే ఎదురయ్యింది. అత్యధికులు దీన్ని బయటకు పంపేందుకే నిర్ణయించారు. దీంతో పిల్లికి 30 రోజుల నోటీసును ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం ప్రజాభిప్రాయం అనుగుణంగానే చేయాలని నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles