ఫ్రీడమ్ 251 లేటుకి కారణం తెలుసా? | cheapest smartphone at Rs 251 begin from July 6

Cheapest smartphone at rs 251 begin from july 6

smartphone at Rs 251, cheapest smartphone, july 7th 2016 cheapest smartphone, modi reason for cheapest smartphone delay, latest news, ఫ్రీడమ్ 251 లేటుకు మోదీ కారణం, మోదీతోనే లేటు అవుతుందట, మోదీతో ఛీఫ్ ఫోన్ కు ఆటంకాలు, Ringing Bells Modi

cheapest smartphone at Rs 251 begin from July 6.The delivery of the world's cheapest smartphone at Rs 251 (less than $4) will finally begin from July 6 and not June 30 as was announced earlier, its makers said on Wednesday, adding that they are trying to meet Prime Minister Narendra Modi for garnering his support under the Make in India initiative.

ఫ్రీడమ్ 251 లేటుకి కారణం తెలుసా?

Posted: 06/29/2016 04:59 PM IST
Cheapest smartphone at rs 251 begin from july 6

చవకైన స్మార్ట్ ఫోన్ గా భారతీయులకు బంఫరాఫర్ ఇచ్చిన 'ఫ్రీడమ్ 251' ఫోన్ల డెలివరీ ఆలస్యం కానుంది. ముందుగా ప్రకటించినట్లు గురువారం అంటే జూన్ 30 నుంచి వీటిని డెలివరీ చేయాల్సి ఉంది. అయితే జూలై 7 నుంచి ఈ డెలివరీలు ప్రారంభమవుతాయని సంస్థ యాజమాన్యం మరోసారి ప్రకటన ఇచ్చింది.

‘‘ప్రధాని నరేంద్ర మోదీని కలిసి, తమ ప్రయత్నానికి మద్దతివ్వాలని కోరాలని భావించామని, అయితే ఆయన అపాయింట్ మెంట్ ఇంకా దొరకలేదని’’ రింగింగ్ బెల్స్ సంస్థ వ్యవస్థాపక సీఈఓ మోహిత్ గోయల్ వెల్లడించారు. ప్రస్తుతం తమ వద్ద 2 లక్షల ఫోన్లు ఉన్నాయని ఆయన తెలిపారు. మేకిన్ ఇండియాలో భాగంగా దేశవాళీ స్మార్ట్ ఫోన్ వ్యవస్థను మరో మెట్టు ఎక్కించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.

వారం రోజుల ఆలస్యంగా డెలివరీ ప్రారంభమవుతుందని, ఈలోగా ప్రధానిని కలుస్తామని ఆయన అన్నారు. తొలి దశ డెలివరీల తరువాత మరోసారి బుకింగ్స్ స్వీకరిస్తామని తెలిపారు. తాము చేసిన తప్పేంటో తెలుసుకున్నామని, ఇకపై సైలెంటుగా ఉండి సంస్థను ముందుకు నడిపిస్తామని అన్నారు. ఒక్కో స్మార్ట్ ఫోన్ పై రూ. 140 నుంచి రూ. 150 నష్టం మిగలనుందని, అయితే, ప్రొడక్షన్ పెరిగే కొద్దీ లాభాల్లోకి వెళ్లగలమన్న నమ్మకముందని ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cheapest smartphone  freedom 251  PM modi  Ringing Bells Mobile  

Other Articles