భార్యను దానం చేసిన మొగుడు, ఎక్కడా? | woman takes care of ex-husband with current partner

Woman takes care of ex husband with current partner

Chinese woman takes care of ex-husband, Husband force wife for second marriage, Husband living together with ex wife and her current partner, కొత్త మొగుడితో ఆ భార్య భర్తను ఏం చేసిందంటే..., తాజా వార్తలు, అంతర్జాతీయ వార్తలు, International news, china news, china husband

Chinese woman takes care of ex-husband with current partner.

భార్యను దానం చేసిన మొగుడు... ఎక్కడ?

Posted: 06/29/2016 04:32 PM IST
Woman takes care of ex husband with current partner

మనిషికి స్వార్థం నానాటికి పెరిగిపోతున్న రోజుల్లో ఎదుటి వారి సుఖం కోసం ప్రయత్నించే వారు ఎవరుంటారు చెప్పండి. అలాంటిది తన భార్య సంతోషం కోసం ఓ భర్త చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. చైనాకు చెందిన ఈ దంపతుల కథ వింటే ఎవరైనా కదిలిపోవాల్సిందే.

జియాంగ్, జుపింగ్ జువాన్ ప్రావిన్స్ లో నివసించే ఓ జంట. వీరికి 1996 లో పెళ్లయింది. పదేళ్లపాటు ఎంతో అన్యోన్యంగా కాపురం చేసిన ఈ జంటపై ఎవరి కళ్లుపడ్డాయో తెలీదుగానీ ఓ యాక్సిడెంట్ తో జియాంగ్ జీవశ్చవంలా మారిపోయాడు. ఎడమవైపు బాడీ పూర్తిగా పడిపోవటంతో మంచానికే పరిమితమయ్యాడు. ఇక అప్పటి నుంచి కదల్లేని భర్త సేవలోనే ఆ భార్య మునిగిపోయింది.

China ex husband with wife and her partner

ఆమె కష్టాన్ని చూడలేకపోయినా జియాంగ్ మరో పెళ్లి చేసుకోవాలంటూ జుపింగ్ పై ఎన్నోసార్లు ఒత్తిడి తెచ్చాడు. కానీ, అందుకు ఆమె అస్సలు ఒప్పుకోలేదు. చివరికి భర్త ఒత్తిడితో జియాంగ్ కు విడాకులిచ్చి 2013 లో ఆమె మరో వివాహం చేసుకుంది. అతను మరెవరో కాదు. జియాంగ్ ప్రాణ స్నేహితుడే. ఇక అప్పటి నుంచి ఈ ముగ్గురు కలిసే ఉంటున్నారు. జుపింగ్ తోపాటు, ఆమె కొత్త భర్త కూడా ఇప్పుడు జియాంగ్ సేవలో మునిగిపోయారు. ఓ చానెల్ కథనంతో వెలుగు లోకి వచ్చిన కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chinese woman  ex-husband  current partner  

Other Articles