మాజీ సీఎంతో చెక్ పెడతారా? | Sheila Dikshit may CM candidate for UP elections

Sheila dikshit may cm candidate for up elections

Sheila Dikshit, delhi EX CM, UP CM candidate, UP congress, UP elections, యూపీ సీఎం అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి షీలా దీక్షిత్, షీలా దీక్షిత్ యూపీ సీఎం, యూపీ ఎన్నికలు 2017, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, యూపీ రాజకీయాలు, జాతీయ వార్తలు, రాజకీయాలు, రాజకీయ వార్తలు, తెలుగు వార్తలు, తాజా వార్తలు, latest news, telugu news

Sheila Dikshit may CM candidate for UP elections. congress rethink about strategy in UP.

మాజీ సీఎంతో చెక్ పెడతారా?

Posted: 06/16/2016 02:48 PM IST
Sheila dikshit may cm candidate for up elections

యూపీ రాజకీయాల్లో మరో కీలకమైన మలుపు చోటుచేసుకోనుంది. సీఎం అభ్యర్థి విషయంలో జాతీయ పార్టీలు ఆడుతున్న దోబూచులాటకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ తరపున రాజ్ నాథ్ సింగ్, వరుణ్ గాందీ పేర్లు పరిశీలనలో ఉండగా, కాంగ్రెస్ తన తరపున అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేసినట్లే కనిపిస్తోంది. పార్టీ ఇన్ చార్జ్ గా ఉన్న మధుసూదన్ మిస్త్రీని తొలగించి గులాం నబీ ఆజాద్ కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సీఎం అభ్యర్థి విషయంలో ఓ స్పష్టతకు వచ్చినట్లు అర్థమౌతోంది.

ఆ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించబోతున్నట్లు పార్టీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముందుగా ప్రియాంకా గాంధీ, లేదా రాజీవ్ గాంధీని సీఎం అభ్యర్థిగా పెట్టాలన్న కార్యకర్తల డిమాండ్ ను పక్కనపడేసి అధినేత్రి సోనియా షీలా వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. పార్టీ ఆజ్నతో కదిలిన షీలా ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి చర్చించనున్నట్టు సమాచారం. ఎట్టిపరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ జేజార్చుకోకుండా, తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నిస్తోంది.

పంజాబ్ ఇన్ చార్జిగా ఉండేందుకు ఆమె విముఖత చూపటంతో హఠాత్తుగా యూపీ బరిలోకి ఆమెను దించాలని పార్టీ చూస్తోందట. కాగా, 1998 నుంచి 2013 వరకు వరుసగా పదేహేనేళ్లపాటు ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఢిల్లీ సీఎంగా ఆమెపై పెద్దగా రిమార్కులు లేనప్పటికీ, యూపీఏ అవినీతి ఆయుధంగా చేసుకున్న ఆప్ అక్కడ అదికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆమెను బరిలోకి దించి బీజేపీ వ్యూహానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ ఫ్లాన్ వేస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sheila Dikshit  delhi EX CM  UP CM candidate  UP congress  UP elections  

Other Articles