కేసీఆర్ రికార్డు చిరిగి చిరిగి చంపుతోంది | Biggest flag big troubles for HMDA officials

Biggest flag big headache for hmda officials

KCR, biggest flag in india, flag headache to HMDA, telangana news, latest news, telugu news, తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు, తాజా వార్తలు, అధికారులకు భారీ జెండాతో తలపోటు, హెచ్ఎండీఏ జాతీయ పతాకం, పెద్ద జాీయ పతాకానికి చిల్లులు, తెలంగాణ అతిపెద్ద జెండా, కేసీఆర్ రికార్డు జెండా

Biggest flag big troubles for HMDA officials. CM KCR biggest flag torns again and again huge headache for officials.

కేసీఆర్ రికార్డు చిరిగి చిరిగి చంపుతోంది

Posted: 06/16/2016 02:06 PM IST
Biggest flag big headache for hmda officials

దేశంలోకెల్లా అతిపెద్ద జెండాను ఆవిష్కరించాలన్న కలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాకారం చేశారు సీఎం కేసీఆర్. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలోని సంజీవయ్య పార్క్ లో 303 అడుగుల ఎత్తైన ధ్వజస్థంభంపై దీని ఎగరవేశారు. 108 అడుగుల ఎత్తు, 72 అడుగుల వెడల్పుతో దేశంలో కెల్లా భారీ జాతీయ జెండాగా ఇది రికార్డులోకి ఎక్కింది. అయితే 78 కిలోల బరువున్న ఈ రికార్డు జెండా ఇప్పుడు అధికారులకు తలపోటుగా తయారయ్యింది.

ఈ మధ్య వీస్తున్న బలమైన గాలులకు ఇప్పటికే ఆ జెండా మూడుసార్లు చిరిగిపోయింది. దీంతో దానిని కిందకు దించి రిపేర్లు చేయటం, తిరిగి ఎగురవేయడం పెద్ద సమస్యగా మారుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో నిర్వహణ బాధ్యతను నెత్తిన వేసుకున్న హెచ్ఎండీఏకు ఈ వ్యవహారం తలకు మించిన భారంగా పరిణమిస్తోంది. మంగళవారం రాత్రి జెండా మూడోసారి చిరిగిపోగా, నిన్న సాయంత్రం దానికి కుట్లు వేసేందుకు అధికారులు శ్రమించాల్సి వచ్చింది. ఆ తర్వాత తిరిగి ఎగురవేసేందుకు చేసిన యత్నించగా, భారీగా గాలలు వీయటంతో అది సాధ్యం కాలేదు. దీంతో నిన్న పగలంతా జెండా లేకుండానే స్తంభం బోసిగా కనిపించింది. పదిరోజులకే ఇన్నిసార్లు మరమత్తులు చేయాల్సి వస్తే భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో అని అధికారులు దీర్ఘాలు తీస్తున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : KCR  biggest flag in india  flag headache to HMDA  

Other Articles