Amitabh Bachchan denied link, records show he joined board meetings via phone | అమితాబ్ అక్రమాస్తులు నిజమే

Amitabh bachchan denied link records show he joined board meetings via phone

Panama, Panama Papers, AMitabh, Aishwarya, Amitabh bachan in Panama Papers, Assets, అమితాబ్, అమితాబచ్చన్, పనామా, పనామా పేపర్స్

On April 4, as part of its ongoing investigation into The Panama Papers, The Indian Express reported that records of Panamanian law firm Mossack Fonseca showed that actor Amitabh Bachchan served as director of four offshore shipping companies between 1993 and 1997.

అమితాబ్ అక్రమాస్తులు నిజమే

Posted: 04/21/2016 01:16 PM IST
Amitabh bachchan denied link records show he joined board meetings via phone

అమితాబ్ బచ్చన్ . ఇది ఇప్పుడు పేరు కాదు. ఓ బ్రాండ్. ఆ పేరు కోసం లక్షల మంది ఆరాటపడతారు. ఆయన ఏం మాట్లాడతారా అని ఎదురుచూస్తుంటారు. అలాంటి అమితాబ్ బచ్చన్ పై ఈ మధ్యన తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. అమితాబ్ విదేశాల్లో డబ్బులు దాచుకున్నాడని పనామా పేపర్స్ వెల్లడించింది. అమితాబ్ తో పాటుగా కోడలు ఐశ్వర్య కూడా ఇందులో ఉందని తేలింది. అమితాబ్ పేరు పనామా పేపర్స్ లో రావడంతో కొన్ని బిజినెస్ బ్రాండ్ లకు దెబ్బతగిలింది. తాజాగా మరోసారి అమితాబ్ ఆస్తుల వివరాలు ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చాయి.

Also Read: బ్లాక్ మనీ జాబితాలో అమితాబ్, ఐశ్వర్య 

తాజాగా అమితాబ్ ఏ కంపెనీల్లో డబ్బు దాచుకున్నారో మరిన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాంప్ షిప్పింగ్ లిమిటెడ్, సీ బల్క్ షిప్పింగ్ కంపెనీల బోర్డు మీటింగుల్లో బచ్చన్ పాల్గొన్నట్లు ఓ పత్రిక మరిన్ని ఆధారాలను బయటపెట్టింది. ఈ ఆధారాల్లో అమితాబ్ 1994లో ఆయా కంపెనీలతో  టెలిఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది. రెండు కంపెనీలు జారీ చేసిన సర్టిఫికెట్‌లో డైరక్టర్ల జాబితాలో అమితాబ్ పేరు కూడా ఉండటం గమనార్హం. పనామా పత్రాల పేరుతో గతంలో విడుదలైన జాబితాలో బిగ్‌బీకి విదేశాల్లో ఖాతాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొదట వచ్చిన ఆరోపణలను అమితాబ్ కొట్టివేశారు. ఆ తర్వాత రెండో జాబితా ఆధారాలను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఆధారాలపై బిగ్ బీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read: బిగ్ బికి పనామా ఎఫెక్ట్.. ఇన్ క్రిడిబుల్ ఇండియా బ్రాండ్ నుంచి అమితాబ్ ఔట్..! 

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles