Not formally approached for 'Atulya Bharat' says Amitabh Bachchan

Amitabh bachchan s incredible india role stuck in panama canal

amitabh bachchan, panama papers, atulya bharat, incredible india, brand ambassador, panama, big b, amitabh panama

"Decision was supposed to be taken this month, decision will only be taken after clean chit is given to Amitabh Bachchan," said sources.

బిగ్ బికి పనామా ఎఫెక్ట్.. ఇన్ క్రిడిబుల్ ఇండియా బ్రాండ్ నుంచి అమితాబ్ ఔట్..!

Posted: 04/20/2016 08:31 AM IST
Amitabh bachchan s incredible india role stuck in panama canal

విదేశాలకు నల్లధనాన్ని తరలించిన 500 మంది భారతీయ పన్ను ఎగవేతదారుల జాబితాలో వున్నారని అభియోగాలను ఎదుర్కోంటున్నబాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు దేశ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించే విషయంలో కేంద్రం అచితూచి వ్యవహరిస్తుంది. ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్ నియామకంపై తుది నిర్ణయం తీసుకునే విషయమై కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుందని తెలుస్తుంది. ఇప్పుడిదే విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు హాట్ టాపిక్ గా మార్చేశాయి.

దేశ కీర్తిప్రతిష్టలను పెంచడంతోపాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు రూపొందించిన ప్రచార కార్యక్రమమే ఇన్ క్రెడిబుల్ ఇండియా క్యాంపెయిన్(అతుల్యభారత్). ఈ కార్యక్రమానికి బాలీవుడ్ దిగ్గజం, దేశవాసులంతా ఇండియాస్ మెగాస్టార్ అని పిలుచుకునే అమితాబ్ బచ్చన్ పేరును బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు. దానికి ఆయన అంగీకరించారని కూడా గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల పనామా లీకేజీ వివాదంలో ఆయనతోపాటు కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ పేర్లు బయటకురావడంతో దీనిపై కేంద్రం పునరాలోచనలో పడిందని తెలుస్తుంది.

కాగా ఈ అంశంపై అమితాబ్ స్పందిస్తూ... అసలు తనను కేంద్రం ఇంతవరకు అతుల్యభారతం కార్యక్రమానికి ప్రచారకర్తగా ఉండమని అధికారికంగా ఆహ్వానించనేలేదన్నారు. ఇదంతా మీడియా ప్రచారమేనని స్పష్టం చేసారు. మీడియాలో తన పేరుపై దుమారం రేగడంతోనే తాను ఈ విషయమై స్పందిస్తున్నానని చెప్పారు, పనామా పేపర్ల అంశంపై కూడా ఆయన స్పందించారు. ఈ లీకేజీలో తన పేరు, తన కోడలి పేరు ఉన్నాయనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసారు. అయినా ఇప్పటికీ మీడియా నుండి పలు రకాల ప్రశ్నాస్త్రాలు తనకు లెక్కలేనన్ని వస్తున్నాయన్నారు. ఈ ప్రశ్నలను తనను కాకుండా కేంద్రప్రభుత్వాన్నే అడగాలని సూచించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles