Cases are not valid in chandrababu period

Call money case also

Chandrababu Naidu, Call Money, Call money case, Rishiteshwari Case

In AP CM Chandrababu Naidu period cases are invalid. Rishiteshwari case, Vanajakshi case and now call money case may not valid.

కాల్ మనీ వ్యవహారం కూడా అంతేనా..?

Posted: 12/17/2015 12:42 PM IST
Call money case also

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు హయాంలో పరిపాలన ఎంతో అమోఘంగా సాగుతోంది.. అద్భుతంగా సాగుతోంది అని ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా నవ్వుకుంటున్నారు జనం. ఎందుకు అలా అనుకుంటున్నారా..? రెండు నెలలు తిరిగితే చాలా చంద్రబాబుతో కనెక్షన్ ఉన్న ఏదో ఒక వివాదం మీడియాలో నానుతోంది. చంద్రబాబు నాయుడు అవినీతిని సహించడు.. తప్పు చేస్తే ఎవరికి వదలరు.. ఇవన్నీ గతంలో మాటలు.. ఇప్పుడు అంతా సొంత లాభం కోసమే నడుస్తోంది. తన పార్టీ నాయకులను కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు కేసులను తొక్కిపెడుతున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలా మారాడు అన్న కారణాలు ఎవరికి అక్కర్లేదు. కానీ ఇలా మారడం మాత్రం మంచిది కాదు అన్నది మాత్రం క్లీయర్.

Also Read: చంద్రబాబుకు అసెంబ్లీలో చుక్కలే

నాగార్జున యూనివర్సిటిలో ఆర్కియాలజీ విద్యార్థిని రిషితేశ్వరి కాలేజ్ లో ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. అయితే రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపాల్ బాబూరావు హస్తం ఉందని క్లీయర్ అయింది.. కానీ ఆయన మీద ఈగ వాలకుండా.. ప్రతిపక్షాలు ఎంత గొంతుచించుకున్నా కానీ పట్టించుకోకుండా కేసును తొక్కేశారు. గంటా శ్రీనివాస్ గారు మూడు పర్యటనలు.. నాలుగు ప్రెస్ మీట్ లు నిర్వహించి.. ర్యాగింగ్ మీద ప్రకటనలు చేసి చేతులు దులుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన రిషితేశ్వరి కేసు మీద తర్వాత ఎందుకు వార్తలు రాలేదు..? కేసు ఎక్కడికి వచ్చింది..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేదు. సరే మొత్తం వ్యవహారానికి ఎవరు కేంద్ర బిందువుగా ఉన్నారా..? అని చూస్తే చంద్రబాబు నాయడు ఖచ్చితంగా కనిపిస్తారు.

Also Read: కాల్ మనీలో చంద్రబాబు డబ్బులు ..? 

ఎమ్మార్వో వనజాక్షి మీద ఓ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడి చేస్తాడు.. దాని మీద సర్వత్రా విమర్శలు వస్తాయి.. కానీ చంద్రబాబుకు అవన్నీ కనిపించవు.. ప్రతిపక్షాల విమర్శలను కాకిగోళ కింద కొట్టేస్తారు. పైగా అధికారులను బదిలీ చేస్తారు తప్పితే తమ నాయకులను మాత్రం కనీసం మందలించడం కూడా చేయరు. ఇక విజయవాడలో ఆరుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన స్వర్ణ బార్ కల్తీ మద్యం కేసు కూడా అంతే. మృతులకు ఐదు లక్షల రూపాయలు ప్రకటించి.. చర్యలు తీసుకుంటామని మీడియా ముందు హుందాగా మాట్లాడిస్తారు. కానీ దానికి కారణమైన వారి మీద ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకు కదులుతోందా అంటే లేనే లేదు.

Also Read: ‘కాల్ మనీ’కి డబ్బులు ఇలా వచ్చాయి.. పూర్తి స్టోరీ ఇదే 

ఇక తాజాగా కాల్ మనీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకలు ఉన్నారని అందరికి అర్థమవుతోంది. కాల్ మనీ కాటుకు ఎంతో మంది మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు.. కానీ చంద్రబాబుకు మాత్రం వారి కన్నీళ్లు కనిపించవు. ఆడవాళ్లకు రక్షణ కావాలంటే చంద్రబాబు ప్రభుత్వం రావాలి అంటే ఎన్నికలకు ముందు తీవ్రంగా ప్రచారం చేసిన చంద్రబాబు గారు ఇప్పుడు మాత్రం దీని మీద మాట్లాడరు. అదే నీతిమాలి తిరుగుతున్న నాయకుల ఇంటి వాళ్లు కూడా ఇందులో బాధితులుగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు పరోక్షంగా కేసులను తొక్కివేస్తూ.. చివరకు సశేషంగానే ముగించేందుకు ప్రయత్నిస్తున్నారని అందరికి అర్థమవుతోంది. ప్రతిపక్షాలు దీని మీద మాట్లాడితే మీరేం తక్కువ.. మీ వాళ్లే వాళ్లు అంటే నీతిమాలి, నీచంగా మాట్లాడుతున్నారు. మరి మిగితా కేసుల్లాగా ఈ కేసు కూడా కంచికి చేరుతుందా..? అంటే అది కాలమే తేలుస్తుంది.

*Abhinavachary*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Call Money  Call money case  Rishiteshwari Case  

Other Articles