Roja said that call money gang tried to involve minors in prostitution

Roja said that call money gang tried to involve minors in prostitution

Roja, Chandrababu, Call Money, Call Money in AP, AP, Assembly, Assembly sessions

YSRCP Leader Roja said that call money gang tried to involve minors in prostitution. She slams chandrabababu govt.

18ఏళ్లలోపు పిల్లలను కూడా వ్యభిచారంలోకి.. రోజా

Posted: 12/17/2015 02:49 PM IST
Roja said that call money gang tried to involve minors in prostitution

కాల్ మనీ కేసు, సెక్స్ స్కాండల్ వ్యవహారంపై వైసిపి ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఎక్కడా ఇలాంటిది వినలేదని రోజా అన్నారు. నవ్యాంధ్ర తాత్కాలిక రాజధాని విజయవాడలోనే ఇదంతా జరుగుతోందంటూ ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వైసిపి అధ్యక్షుడు జగన్ మీద ఎదురుదాడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రోజా మండిపడ్డారు. కాల్ మనీ వ్యవహారంపై చర్చించేందుకు టిడిపి భయపడుతోందని ఆమె ఆరోపించారు. భర్త ముందే భార్యను తీసుకెళ్లి ఎప్పుడు వదిలిపెడతారో కూడా తెలియని ఘటనకు చోటు చేసుకున్నాయని అన్నారు. అప్పు తీసుకున్న వారు చెల్లించకపోతే వారి పిల్లలను సైతం వ్యభిచారంలోకి దింపిన ఘటనలు చాలా బైటపడుతున్నాయని అన్నారు. ఈ కాల్ మనీ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు కూడా సంబంధం ఉందంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. కాల్ మనీ వ్యవహారం సభను కుదిపేయడంతో స్పీకర్ కోడెల అసెంబ్లీని 10 నిమిపాల పాటు వాయిదా వేశారు. కాల్ మనీ కేసులో నిందితుడైన వెనిగళ్ల శ్రీకాంత్.. టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కి సన్నిహితుడని, ఇద్దరూ కలిసి బ్యాంకాక్ వెళ్లారని రోజా అన్నారు. కాల్ మనీలో ప్రసాద్ కు భాగస్వామ్యం ఉందని స్థానికులు చెబుతున్నా ఆయనను ఎందుకు విచారించడం లేదని రోజా ప్రశ్నించారు.

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఇతరుల పేర్లు కూడా బయటకు వచ్చినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. సొంత పార్టీ నేతలను తప్పించేందుకు ఆ బురదను అందరికీ అంటించేందుకు చంద్రబాబు  ప్రయత్నిస్తున్నారని రోజా దుయ్యబట్టారు. 18 ఏళ్ల లోపు పిల్లలను కూడా వ్యభిచారంలోకి దించుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తేనే మహిళలకు భరోసా ఇచ్చినట్లవుతుందని రోజా పేర్కొన్నారు. కాగా విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ను సెలవులో పంపేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నించిందని రోజా ఆరోపించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రపంచ స్థాయికి రాజధాని వెళ్తుందని చంద్రబాబు బాబు చెప్పారు. కానీ మొన్న వనజాక్షి విషయం, నిన్న కల్తీ మద్యం కేసు, ఇప్పుడు కాల్ మనీ వ్యవహారం.. ఇవన్నీ చూస్తుంటే.. రాష్ట్ర తాత్కాలిక రాజధానిలో తల దించుకునే పరిస్థితి ఉందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  Chandrababu  Call Money  Call Money in AP  AP  Assembly  Assembly sessions  

Other Articles