Spain PM punched in the head during campaign appearance

Spain pm punched in the head during campaign appearance

Spain, Mariano Rajoy, Mariano Rajoy punched, Spain PM, Spain PM punched

Mariano Rajoy, the Spanish prime minister, was punched in the head on Wednesday afternoon in Galicia during a campaign appearance before Sunday's general election. A man in the crowd approached Mr Rajoy, reportedly asking for a picture with the politician, before he suddenly lashed out with his left fist, hitting the prime minister in the side of the head and throwing him off balance.

ITEMVIDEOS: సెల్ఫి కోసం వచ్చి ప్రధాని ముఖం పై గుద్దిండు

Posted: 12/17/2015 12:51 PM IST
Spain pm punched in the head during campaign appearance

అవును.. మీరు చదువుతున్నది అక్షరాల నిజం. సెల్ఫీ కోసం అంటూ ప్రధాని దగ్గరికి వచ్చిన ఓ యువకుడు... సెల్ఫీ దిగకుండా.. ప్రధాని మూతి మీద గట్టిగా ఓ పిడి గుద్దు వదిలాడు. ఇదంతా ఎక్కడ అని అనుకుంటున్నారా.? స్పేయిన్ లో ఒక ర్యాలీ లో పాల్గొంటున్న ప్రధాని సెల్ఫీ కోసం అని దగ్గరకు వచ్చి ఆయన పై దాడి చేసాడు. దాడి చెయ్యడమే కాకుండా ప్రధాని కళ్లజోడు విరగకొట్టాడు. స్పెయిన్ ప్రధాని మరియానో రాజోయ్ పెంటేవేద్రా అనే పట్టణంలో ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆండ్రీస్ డెల్ వీ అనే ఓ యువకుడు సెల్ఫీ తీసుకోవడానికి అన్నట్లుగా ప్రధాని దగ్గరికి వచ్చాడు. కుడి చేతిలో ముబైల్ పట్టుకుని సెల్ఫీ కోసం ప్రధానికి దగ్గరికి వచ్చాక, ఆ యువకుడు తన ఎడమ చేతితో ప్రధాని రాజోయ్ ముఖంపై ఓ పంచ్ విసిరాడు.

ఉన్నట్టుండి.. జరిగిన పరిణామానికి అక్కడి భద్రతా సిబ్బంది షాకయ్యారు. వెంటనే ఆ యువకున్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని ని ఓ అధికారి కారులో అక్కడి నుంచి లా కరునా నగరానికి తీసుకెళ్లారు. ఈ అనూహ్య సంఘటనకు పార్టీ మంత్రులు, నేతలు షాక్ తిన్నారు. స్పానిష్ సోషలిస్ట్ పార్టీ నేతలందరి తరఫున ప్రధాని రాజోయ్ కు ఆ పార్టీ నేత పెడ్రో సాంచెజ్ తన సంఘీభావాన్ని తెలిపారు.  తాను ఇలా ప్రధాని పై దాడి చేసినందుకు చాలా ఆనందపడుతున్నట్లు అరెస్టు అయిన యువకుడు చెప్తున్నాడు. తదుపరి విచారణ కొనసాగుతుంది. మొత్తానికి సెల్ఫీ అంటూ నాయకులు ఉత్సాహపడుతుంటారు.. మరి వాళ్లు ఈ వార్త చదివితే సెల్ఫీ కూడా చాలా జాగ్రత్తగా దిగుతారేమో..!

*Abhinavachary*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Spain  Mariano Rajoy  Mariano Rajoy punched  Spain PM  Spain PM punched  

Other Articles