Congress member watching obscene video in Odisha assembly

Congress member watching obscene video in odisha assembly

comgress, obscene video, Porn Videos, Odisha, Nabakishore Das, Odisha assembly

A Congress legislator was on Monday caught on camera while allegedly watching an obscene video clip on his mobile phone in the Odisha assembly. The legislator has denied the allegation. Congress member Nabakishore Das was caught in camera by a local news channel during question hour.

అసెంబ్లీలో బ్లూఫిల్మ్ చూసిన ఎమ్మెల్యే

Posted: 12/15/2015 11:13 AM IST
Congress member watching obscene video in odisha assembly

పట్ట పగలు.. నిండు సభలో.. ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన వాళ్లు తీరిగ్గా.. బ్లూ ఫిల్మ్ చూస్తూ కనిపించారు. ఒడిశా అసెంబ్లీ సాక్షిగా ఓ శాసనసభ్యుడు చేసిన నిర్వాకం మీద దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఒడిశా రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నబొదాస్‌ సభలో తన స్థానంలో కూర్చుని స్మార్ట్ ఫోన్‌ లో నీలి చిత్రాలు చూసినట్లు తెలుస్తోంది. దీంతో అధికార పక్ష బిజూ జనతాదళ్‌ (బీజేడీ) సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు. బిజు జనతాదళ్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రమీలా మల్లిక్‌ మీడియాతో మాట్లాడుతూ శాసనసభలో పవిత్రమైన సభలో బ్లూ ఫిల్మ్ లు చూడటం నేరమని, దీనిపై దర్యాప్తు చేసి నబొదాస్‌ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేడీ శాసనసభ్యుడు అమర్‌ శత్పథి మాట్లాడుతూ ఈ సంఘటన సభ గౌరవానికి మాయని మచ్చ తెచ్చిందన్నారు.

Also Read: ‘హెల్ప్’ అంటూ పోలీసులను ఆశ్రయించిన పోర్న్-స్టార్ 

కాగా.. తనపై వచ్చిన ఆరోపణలపై నబొదాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. స్మార్ట్-ఫోన్‌ వినియోగంపై తనకు అంతగా అవగాహన లేదని, కీలకమైన పత్రాలు చూసేందుకు నెట్ లోఅంతర్జాలంలో వెతుకుతుండగా పొరపాటున వేరే వెబ్‌ సైట్ లో ప్రవేశించడంతో బ్లూ ఫిల్మ్స్ కనిపించాయే తప్ప ఉద్దేశపూర్వకంగా తాను తప్పు చేయలేదని చెప్పారు. అవసరమైతే దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. శాసనసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నందున తనపై దుష్ప్రచారం చేస్తున్నారని నబొదాస్ ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : comgress  obscene video  Porn Videos  Odisha  Nabakishore Das  Odisha assembly  

Other Articles