CBI raids Arvind Kejriwal's office, seals it; Delhi CM calls Narendra Modi a coward and psycopath

Arvind kejriwal s office raided by cbi his office sealed claims delhi government

arvind kejriwal vs centre,Arvind Kejriwal,Arvind Kejriwal vs PM Modi,kejriwals office raided,Kejriwals office sealed, cbi, kejriwal cbi raid, cbi raid in kejriwal office, aap, aam aadmi party, bjp

The Central Bureau of Investigation on Tuesday raided Delhi Chief Minister Arvind Kejriwal's office and sealed it.

ఢిల్లీ సీఎం కార్యాలయంపై సిబిఐ దాడులు, ఆఫీస్ సీజ్.. పిరికిపంద చర్యగా అభివర్ణించిన కేజ్రీ

Posted: 12/15/2015 09:59 AM IST
Arvind kejriwal s office raided by cbi his office sealed claims delhi government

దేశరాజధాని ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ పై కేంద్రం మరో బ్రహ్మాస్తాన్ని సంధించింది. ఢిల్లీ సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంపై ఇవాళ ఉదయం అకస్మాత్తుగా సిబిఐ అధికారులు జరిపిన దాడులు రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తున్నాయి. సీఎం కార్యాయలంతో పాటు పలువురు మంత్రుల కార్యాలయాలపై కూడా సిబిఐ దాడులు నిర్వహించింది. అంతేకాదు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంతో పాటు ప్రిన్సిపాల్ సెక్రటరీ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించారు.  ఢిల్లీ సచివాలయంలోకి ముఖ్యంగా ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శుల కార్యాలయంలోనికి ఎవరూ రానీయకుండా సీజ్ చేశారు.

అయితే కారణాలు లేకుండా, అకారణంగా సిబిఐ అధికారులు ఈ దాడులకు నిర్వహించడంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. సచివాలయంలో సిబిఐ దాడులు చేసి మంత్రులు, కార్యదర్శులు సహా తన కార్యాలయంలోనూ తనిఖీలు చేపట్టడాన్ని దృవీకరించిన అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాన మంత్రి పిరికి పంద చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాజకీయంగా తనను ఎదుర్కోనలేక..ఇలా దొడ్డిదారిన తన కార్యాలయంపై దాడులు నిర్వహించి.. తనిఖీలు చేయిస్తున్నారని అరోపించారు. ఇది తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రగా ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంపై తాము దాడులు చేశామని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అది పూర్తిగా అవాస్తవమని సిబిఐ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే సిబిఐ దాడులపై అప్ పార్టీ ఇవాళ మధ్యాహ్నం స్పందించనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arvind kejriwal  cbi  delhi  kejriwal office  

Other Articles