Porn star Vladislava Zatyagalova sues her Russian parents after they changed the locks at their home when they found out about her career | porn star controversies

Porn star vladislava zatyagalova sues her russian parents after they changed locks at their home when they found out her career

Vladislava Zatyagalova, porn star Vladislava Zatyagalova, russian porn star sues her parents, Vladislava Zatyagalova sues her parents, porn star controversies, romance movies

Porn star Vladislava Zatyagalova sues her Russian parents after they changed locks at their home when they found out her career : A porn star Vladislava Zatyagalova is suing her parents after they allegedly disowned her and changed the locks on the family home when they found out about her career.

‘హెల్ప్’ అంటూ పోలీసులను ఆశ్రయించిన పోర్న్-స్టార్

Posted: 10/30/2015 04:51 PM IST
Porn star vladislava zatyagalova sues her russian parents after they changed locks at their home when they found out her career

నీలిచిత్రాల పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఓ రష్యా పోర్న్ స్టార్.. తనకు హెల్ప్ చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. తన తల్లిదండ్రులు తనను ఇంట్లోకి రానీయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎంచుకున్న వృత్తి గురించి తెలియడంతో తనను కూతురిగా అంగీకరించడం లేదని ఆమె ఫిర్యాదు చేసింది. ఇంట్లో వున్న వస్తువులను తీసుకెళ్ళడానికి కూడా అనుమతించడం లేదని బోరమంటోంది. ఈ విధంగా తనతో ప్రవర్తించడం చాలా దారుణమంటూ ఆ పోర్న్ స్టార్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

రష్యాకు చెందిన 20 ఏళ్ల వ్లాదిస్లావా జాత్యగలోవాకు సినిమాలంటే పిచ్చి. ముఖ్యంగా కొరియోగ్రఫీ వృత్తి అంటే ప్రాణం. ఆమె ఇష్టాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు సైతం ఆమెకు మద్దతు తెలిపారు. కొరియోగ్రఫీలో ట్రైనింగ్ కూడా ఇప్పించారు. శిక్షణ పొందిన అనంతరం వ్లాదిస్లావా చిత్రపరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్లింది. అక్కడ తనవంతు ప్రయత్నాలు చేసింది కానీ.. ఆఫర్లు దక్కలేదు. ఆ బాధలో కుంగిపోతున్న ఆమెకు అక్కడ పరిచయమైన కొందరు ‘పోర్న్’ సినిమాల గురించి తెలియజేశారు. తొలుత కాస్త సంకోచించిన ఈ అమ్మడు.. చివరికి ఆ రంగంలో అడుగుపెట్టింది. సోఫీ గోల్డ్ ఫింగర్ పేరుతో పలు పోర్న్ సినిమాల్లో నటించింది కూడా. అటు కుటుంబసభ్యులేమో తమ కూతురు మంచి కొరిగ్రాఫర్ అవుతుందని కలలు కంటుంటే.. ఇటువైపు ఈమె మాత్రం పోర్న్ సినిమాలు చేసుకుంటూ అందులోనే తన తృప్తి వెదుక్కుంది. చివరికి ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసింది. కొరియోగ్రాఫర్ అవుతుందనుకున్న తమ కూతురు పోర్న్ స్టార్ గా తిరిగిరావడంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయి.. ఆ క్షణం నుంచి ఆమెను దూరంగా వుంచడం మొదలుపెట్టారు. తనను అర్థం చేసుకుని ఇంట్లోవాళ్లు మనస్సు మార్చుకుని మళ్లీ పిలుచుకుంటారని వ్లాదిస్లావా భావించింది కానీ అలాంటిదేమీ జరగలేదు. దీంతో ఆమె తనకు ‘హెల్ప్’ చేయడంటూ పోలీసులను ఆశ్రయించింది.

తాను పోర్న్ స్టార్ గా మారినందుకు తన తల్లిదండ్రులు తనను ఇంట్లోకి రానీయడం లేదని వ్లాదిస్లావా పేర్కొంది. ఇంట్లో ఉన్న తన వస్తువులు తీసుకెళ్లడానికి కూడా అనుమతించలేదని, తలుపులకు తాళాలు వేసుకున్నారని తెలిపింది. పోర్న్ చిత్రాల్లో నటిస్తుండటంతో తన తల్లిదండ్రులు సంకుచితంగా ఆలోచిస్తున్నారని ఆమె మండిపడింది. పోర్న్ చిత్రాల్లో నటిస్తున్నాననే కారణంతో తనను ఇంట్లోకి రానీయపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది. సమాజంలో పరువు ప్రతిష్ఠలు పోతాయనే భయంతో కూతురుగా అంగీకరించేందుకు తన తల్లిదండ్రులు జంకుతున్నారని తెలిపింది. గతంలో తల్లిదండ్రులు తనను హింసించారని కూడా ఆరోపించింది. తనను భౌతికంగా, మానసికంగా హించారని వాపోయింది. ఇదిలావుండగా.. వ్లాదిస్లావాతో మాట్లాడేందుకు కూడా ఆమె తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. లాయర్ ఆండ్రీ టెమ్నికోవ్ ద్వారా ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. తమపై చేసిన ఆరోపణలపై దావా వేస్తామని ఆమెను తల్లిదండ్రులు హెచ్చరించారని స్థానిక మీడియా తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vladislava Zatyagalova  porn star controversies  russian porn stars  

Other Articles