French launch massive anti ISIS airstrikes in Syria

French launch massive anti isis airstrikes in syria

Paris, Attacks, paris attacks by ISIS, ISIS, ISIS Terrorists, Terrorists, Paris attack, france, freance on ISIS, War on ISIS

Two days after the deadly terror attacks in Paris that left at least 129 people dead and 352 injured, a French defense official says they have conducted "massive" airstrikes that have destroyed two jihadi sites in the Islamic State of Iraq and Syria (ISIS) group's de facto capital in Syria.

ఐసిస్ మీద ఫ్రాన్స్ యుద్దం మొదలైంది

Posted: 11/16/2015 10:57 AM IST
French launch massive anti isis airstrikes in syria

ప్యారిస్ దాడి తర్వాత ఐసిస్ మీద పూర్తి స్థాయి యుద్దానికి దిగింది ప్రాన్స్. 129 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఐఎస్ ఉగ్రవాదుల స్థావరాలే టార్గెట్ గా చేస్తూ ఫ్రాన్స్ దాడులకు పాల్పడుతోంది. ఫ్రాన్స్ సైన్యం టార్గెట్ ఐసిస్ తో ముందుకు వెళుతోంది. ఐసిస్ ఉగ్రవాదుల మీద ప్రపంచం మొత్తం వ్యతిరేక వ్యక్తం అవుతుండటం.. అలాగే జి-20 దేశాల సమావేశంలో కూడా ఐసిస్ మీద యుద్దం చెయ్యాలని తీర్మానించడం జరిగింది. తాజాగా ఫ్రాన్స్ సైనిక బలగాలు ఐసిస్ స్థావరాలను టార్గెట్ చేసి.. కీలకంగా ఉన్న ట్రెయినింగ్ క్యాంప్ ల మీద వైమానిక దాడులకు దిగింది. గత కొంత కాలంగా ఫ్రాన్స్ బలగాలు ఐసిస్ మీద దాడులకు పాల్పడుతున్నాయి. అయితే సిరియాలో వేలు పెట్టినందుకే ఈ దాడి అంటూ ఐసిస్ ప్రకటించడం.. దానికి ఫ్రాన్స్ కూడా బదులిచ్చేందుకు సిద్దం కావడం జరిగింది.

Also Read: ఉగ్రవాదానికి జి-20 దేశాల చరమగీతం

అమెరికా, రష్యా, చైనా, యుకెతొ పాటు భారత్ కూడా ఐసిస్ కు వ్యతిరేకంగా యుద్దం చెయ్యడానికి సిద్దమవుతోంది. అందుకు గాను అన్ని దేశాలు కలిసి జి20 సమావేశంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. శరణార్థుల రూపంలో వచ్చిన ఉగ్రవాదులు దాష్టికానికి పాల్పడటం మీద అందరూ మండిపడుతున్నారు. యుకెతో పాటు పలు దేశాలు శరణార్థులకు తలుపులు మూసి వేసింది. ఇక మీదట కూడా ఫ్రాన్స్ ప్రశాంతంగా ఉండబోదు అని.. కనీసం బయటకు వెళ్లాలంటే కూడా బిక్కుబిక్కు మంటూ వెళ్లాల్సి వస్తుందని ఐసిస్ హెచ్చరించింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles