TRS MP kavitha said that War one side in warangal elections

Trs mp kavitha said that war one side in warangal elections

TS, Kavitha, MP Kavitha, Warangal, Warangal elections, Elections, TRS in Warangal, Mp kavitha contraversial comments, Kavitha comments

TRS MP Kavitha participated in Warangal election campaign. She motivate TRS cader to work hard for party. She said that War one side in Warangal elections.

వరంగల్ వార్ వన్ సైడ్: ఎంపీ కవిత

Posted: 11/16/2015 09:05 AM IST
Trs mp kavitha said that war one side in warangal elections

వరంగల్ లోక్ సభకు జరగనున్న ఉప ఎన్నికల రేసులో కారు జోరుగా పరుగెడుతోంది. టీఆర్ ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలుపు కోసం టీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు మంత్రులు నియోజకవర్గాల వారీగా ప్రచార బాధ్యతలు చేపట్టి... ర్యాలీలు, సభలు నిర్వహించారు. ఎన్నికల టైమ్ ముంచుకు వస్తుండటంతో బహిరంగసభలపై దృష్టిపెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలో గులాబీ పార్టీ నేతలు ధూంధాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కవితతో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాటలు పాడుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

ఉద్యమంలో కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు ఎంపీ కవిత. అధికారంలో ఉన్నపుడు గుర్తుకురాని రైతులు.. కాంగ్రెస్ నాయకులకు ఎన్నికల సమయంలో గుర్తుకువస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అద్దె అభ్యర్థితో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుండగా... అప్పు తెచ్చుకున్న అభ్యర్థితో బీజేపీ బరిలోకి దిగిందని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని.. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ లాంటి పథకాలతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారు. స్థానికేతరులను గెలిపిస్తే అభివృద్ధికి ఆస్కారం ఉండదని... అందుకే స్థానికతకే పట్టం కట్టాలని ప్రచారం చేస్తున్నారు. కాగా ఎంపీ కవిత వరంగల్ లో వార్ వన్ సైడ్ అయిందని వ్యాఖ్యానించారు. అయినా వార్ వన్ సైడ్ అయితే ఎందుకు మంత్రులు, ముఖ్య నేతలు అంతలా ప్రచారం చేస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles