a new twist came out in police investigation in actor balaprashant death case | actor illegal affair with housewife

New twist in actor bala prashant death case in illegal affair

balaprashant death case, telugu actor death case, actor illegal affair with housewife, balaprashant illegal affair with housewife, police investigation in bala prashant death case

new twist in actor bala prashant death case in illegal affair : a new twist came out in police investigation in actor balaprashant death case.

నటుడు బాలప్రశాంత్ మృతికేసులో ‘కారు’ ట్విస్ట్!

Posted: 11/16/2015 10:57 AM IST
New twist in actor bala prashant death case in illegal affair

ఓ వివాహితతో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్న వర్థమాన నటుడు బాలప్రశాంత్ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే! ఈ మృతి కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు ఓ కీలకమైన విషయం తెలిసింది. ఆ హీరో తన స్కోడా కారులో రావడం వల్లే అతని మృతికి కారణమైందని విచారణలో వెల్లడవుతున్న విషయాలు తెలుపుతున్నాయి.

మూసాపేటలోని ఆంజనేయనగర్‌లో వుంటున్న బాలప్రశాంత్ చిన్నపిల్లలకు డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నాడు. ఓ వివాహిత తన కూతురిని డ్యాన్స్ నేర్పేందుకు ఇతని వద్దకు తీసుకొచ్చింది. అప్పుడు ఏర్పడిన వీరి పరిచయం.. వివాహేతర బంధంగా మారింది. ఇలా రెండేళ్లుగా తమ బంధాన్ని వీరిద్దరూ గుట్టుగానే సాగించారు. అప్పుడప్పుడు భర్తకు అనుమానం వచ్చినా.. తమ మధ్య ఏమీలేదంటూ ఆ వివాహిత దాటవేస్తూ వచ్చేదట.  ఇలా సాగుతున్న క్రమంలోనే.. ఈనెల 13వ తేదీన ప్రియురాలి భర్త అనంతపురంలోని ఒక ఫంక్షన్‌కు వెళ్లాడు. అప్పుడు తన ప్రియుడు బాలప్రశాంత్ కు ఆమె ఫోన్ చేసి.. ‘ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా రమ్మ’ని పవర్‌నగర్‌లో ఉండే ఆమె ఆహ్వానించింది. దీంతో ఆ నటుడు వెంటనే తన స్కోడా కారు వేసుకుని ఆమె ఇంటికి వెళ్ళాడు. అయితే ఆమె భర్త తన బావమరిదికి ఫోన్‌చేసి.. ‘ఇంట్లో మీ అక్క ఒక్కతే ఉందని, ఇంటికి వెళ్లి ఉండాలని’ చెప్పాడు. దాంతో అతను తన అక్క ఇంటికి వెళ్ళాడు.

అక్కడికెళ్ళిన అనంతరం అతను గడియ కొట్టగా.. తాను నిద్రపోతున్నానని ఇంటికి వెళ్లిపోమని ఆ వివాహిత తన సోదరుడికి చెప్పింది. ఈ విషయాన్ని బావమరిది తన బావకు చెప్పగా.. అనుమానం వచ్చిన ఆయన సెల్లార్‌లో వాహనాలు ఉన్నాయేమో చూడమని చెప్పాడు. స్కోడా కారు ఉందని బావమరిది చెప్పడంతో అనుమానం వచ్చిన భర్త... తన అక్కాబావలను తన ఇంటికి వెళ్లమని చెప్పాడు. వారు వెళ్లగా గడియ తీసిన వివాహిత ‘నన్ను ప్రశాంతంగా ఉండనీయండి’.. అంటూ చేతులు కోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడి నుంచి ఆమె సెల్‌ఫోన్ ద్వారా ‘ ప్లీజ్ ఎలాగైనా తప్పించుకో’ అని బాలప్రశాంత్‌కు మెస్సేజ్ పెట్టగా.. అలాగే చేస్తా అని అతను తిరిగి మేస్సేజ్ పెట్టాడు. తర్వాత ఇంట్లోంచి తప్పించుకొని వెళ్లే క్రమంలో అపార్ట్‌మెంట్‌పై నుంచి కిందపడి మృతి చెందినట్టు భావిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bala prashant death case  police investigation  actor affair with housewife  

Other Articles