Nara Lokesh very happy with that person

Nara lokesh very happy with that person

Nara Lokesh, TDP, Lokesh, Nara family, Nara Lokesh News, Nara Lokesh with Devanshu, Devanshu, Chandrababu Naidus grand son, balakrishnas grand son

Telugu Desam party General secretry Nara Lokesh Very happy with that person. He share his happyness with others.

ఆ బుడ్డోడి వల్ల నారా లోకేష్ హ్యాపీ

Posted: 11/13/2015 11:21 AM IST
Nara lokesh very happy with that person

తెలుగుదేశం పార్టీ నేషనల్ కమిటి జనరల్ సెక్రటరీ, ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ చాలా ఎంజాయ్ చేస్తున్నాడట. తన ఎంజాయ్ మెంట్ కు కారణం ఎవరా అనుకుంటున్నారా..? ఇంకెవరు ఓ బుడ్డోడు అని సమాధానం ఇస్తున్నారు. ఇప్పుడిప్పుడే కీలకంగా మారిన నారా లోకేష్ పార్టీ కార్యక్రమాల్లో చాలా హుషారుగా పాల్గొంటున్నారు. పార్టీలో ప్రస్తుతం కీలక నిర్ణయాలు తీసుకునే దశలో నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం, పార్టీ సభ్యత్వ నమోదు చెయ్యడం లాంటి కీలక సందర్భాల్లో నారా లోకేష్ చురుకుగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే వారి కోసం ప్రత్యేకంగా నిధిని కూడా ఏర్పాటు చెయ్యడంలో లోకేష్ కీలక పాత్ర వహించారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉన్నా కానీ తాను మాత్రం బుడ్డోడి వల్ల చాలా హ్యాపీగా ఉన్నానని అంటున్నారు.

Also Read: అమరావతి కోసం చంద్రబాబు ఫ్యామిలీ ఫోటో సెషన్ 

తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఆశా కిరణంగా వెలుగుతున్న నారా లోకేష్ ప్రస్తుతం ఫాదర్ హుడ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తన కొడుకు దేవాన్షు పుట్టిన తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని అది తనకు కూడా బాగా అనిపిస్తోందని అంటున్నారు. దేవాన్షుకు తానే ప్రేమతో గోరు ముద్దలు తినిపిండం చాలా ఆనందంగా కొత్తగా ఉందని అంటున్నారు నారా లోకేష్. తండ్రిగా మారిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉన్నా కానీ దేవాన్షు కోసం ఖచ్చితంగా టైం కేటాయించాల్సి వస్తోందని.. ఆ టైం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని నారా లొకేష్ తన అనుభవాలను పంచుకున్నారు.

Also Read: పెదబాబు ప్లానేస్తే.. చినబాబు చిటికేశాడా?

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles