Canadian Minister Harjit Sajjan racially abused by soldier on social media

Canadian minister harjit sajjan racially abused

canada, Harjit Sajjan, Defence Minister, racist remarks, Harjit singh News, harjit singh in canada

Canada’s newly-appointed Sikh Defence Minister Harjit Sajjan has allegedly faced racist remarks by a soldier on social media, prompting the Canadian Armed Forces to launch a probe.

కెనడాలో మంత్రైనా.. భారతీయుడికి జాతి వివక్షత తప్పలేదు

Posted: 11/13/2015 01:05 PM IST
Canadian minister harjit sajjan racially abused

దేశం కాని దేశంలో మన కీర్త పతాకాలు ఎగరవేస్తున్న బారతీయ మూలాలున్న వారికి గౌరవాలు దక్కుతున్నా కానీ అక్కడక్కడ అవమానాలు తప్పడం లేదు. తాజాగా కెనడాలో మన వాడు రక్షణ మంత్రిగా అయ్యాడు అని గర్వించిన మనకు అంతలోనే చేదు వార్త అందింది. కెనడాలో ఇటీవలే రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భారతీయుడు  హరిజిత్ సజ్జన్ జాతి వివక్ష ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అదీ కెనడా ఆర్మ్ డ్ ఫోర్స్ కు చెందిన ఓ సైనికుడితో. సోషల్ మీడియా సాక్షిగా ఆ సోల్జర్ సజ్జన్ బ్యాక్ గ్రౌండ్ ని కించపరుస్తూ..ఫ్రెంచ్ భాషలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే అతను ఏమని ఆరోపణలు చేశాడన్నది తెలియాల్సి ఉంది.

కాగా ఈ ఘటనపై ఆర్మీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ పని చేసింది ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. తమ దేశంలో అందరూ సమానమేనని.. దేశగౌరవం పోగొట్టే చర్యలకు ఎవరు పాల్పడినా ఆర్మ్ డ్ ఫోర్స్ లో స్ధానముండదని ఆయన చెప్పినట్లు సమాచారం. మొత్తానికి అప్పుడు అమెరికాలో మన విద్యార్థుల మీద, ఆస్ట్రేలియాలో కూడా దాడుల గురించి చదివిన మనం.. చిరవకు రక్షణ మంత్రిగా పని చేస్తున్న వ్యక్తి కూడా అవమానం జరగడం విచారకరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles