Police brutally beating a woman thief in police station

Police brutally beating a woman thief

Police, Rajasthan, lady Thief, Police Treatment, Women Thief, Police Harrasment

Rajasthan police Police brutally beating a woman thief in police station. A women theft something, police took her into their custody. After that police brutally beat her.

ITEMVIDEOS: మహిళా దొంగను చావబాదిన ఖాకీలు

Posted: 09/22/2015 11:28 AM IST
Police brutally beating a woman thief

పోలీసులంటేనే కఠినాత్ములు అనే మాంచి పేరు ఉంది. అవకాశం దొరికితే చాలు తమ చేతివాటంతో ఎదుటి వారి కంట్లో నీళ్లు తెప్పించే పనిలో ఖాకీలు ఎప్పుడూ ముందుంటారు. తమ లాఠీలకు పని చెప్పడానికి ఇరవై నాలుగు గంటలు సిద్దంగా ఉండే పోలీసులు మరొసారి తమ కఠినత్వాన్ని రుజువు చేసుకున్నారు. మహిళ అన్న ధ్యాస కూడా లేకుండా పశువును బాదినట్లు బాదిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఓ దొంగతనంలో పోలీసులు అరెస్టు చేసిన మహిళ మీద పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. రూల్స్ అంటూ మాకు ఏం చెల్లవు అంటూ తమ స్టైల్లో ట్రీట్ మెంట్ చేశారు. అయితే అలా పోలీసులు మహిళను బాదుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Also Read: పాపం.. ఆ డాక్టర్ ను వీర బాదుడు బాదారు

Also Read: దెయ్యాలు’ అమ్ముతున్న వ్యక్తుల భరతం పట్టిన పోలీసులు

రాజస్థాన్ కు చెందిన ఓ మహిళను దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మామూలుగా అయితే విచారణ చేసి కోర్టుకు అప్పగించాలి.. కానీ ఆ మహిళను పోలీస్ స్టేషన్ లోనే బెల్ట్ తో వీరబాదుడు బాదురు. అయితే ఆ కొట్టింది కూడా మహిళే. మహిళా దొంగను మహిళా కానిస్టేబుల్ చేతనే కొట్టించిన పోలీసులు తర్వాత అక్కడే ఉన్న మరో పోలీస్ కూడా కొట్టడంతో సహాయం చేశారు. మొత్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో ఉన్నతాధికారులు దీని మీద విచారణకు ఆదేశించారు. బాధితురాలికి సరైన వైద్యం అందించి.. న్యాయం చేస్తామని అధికారులు అంటున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Rajasthan  lady Thief  Police Treatment  Women Thief  Police Harrasment  

Other Articles