Mob attacked on a doctor in UP

Mob attacked on a doctor in up

Doctor, Uttarpradesh, Sitarpur, Mob attack, Mob attack on Doctor

Mob attacked on a doctor in uttarpradesh. In Uttarpradesh, sitarpur hospital, mob attacked on a doctor. The mob abuse doctor and attacked violently.

పాపం.. ఆ డాక్టర్ ను వీర బాదుడు బాదారు

Posted: 09/21/2015 01:10 PM IST
Mob attacked on a doctor in up

డాక్టర్.. అంటేనే అందరికి ఒకరమైన గౌరవం... కానీ ఉత్తర్ ప్రదేశ్ లో మాత్రం ఓ డాక్టర్ ను అతని ఆసుప్రతిలోనే వీర బాదుడు బాదారు. డాక్టర్ మీద బాగా కసిగా ఉన్న యువకులు ఒక్కసారిగా దాడికి దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డాక్టర్ తో మాట్లాడుతూ.. మాట్లాడుతూ మాటా మాటా పెరిగి చివరకు దాడి వరకు వెళ్లింది. గుంపుగా వచ్చిన యువకులు డాక్టర్ మీద దాడికి దిగడంతో ఆస్పత్రి సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. డాక్టర్  ఎంత పారిపోయేందుకు ప్రయత్నించినా కానీ ఆ యువకులు మాత్రం వదలకుండా వెంటపడి మరి కొట్టారు.

Also Read: డ్యాన్సుల వద్దన్నందుకు పోలీసుల మీద దాడి

ఉత్తర్ ప్రదేశ్ లోని సీతార్పూర్ ఆస్ప్రతిలో అఖిలేష్ అనే డాక్టర్ పని చేస్తున్నారు. అయితే ఆ ఆస్పత్రికి  వచ్చిన కొంత మంది యువకులు డాక్టర్ తో వాగ్వాదానికి దిగారు. అంబులెన్స్ ను పంపించడంలో లేట్ చేశారని వారు మాటల యుద్దానికి తెర తీశారు. అయితే డాక్టర్ అక్కడి నుండి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా యువకులు దాడికి దిగారు. నోటికి వచ్చినంతా తిట్టి.. డాక్టర్ ను తీవ్రంగా గాయపరిచారు. ఆ దాడితో అక్కడి ఆసుప్రతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డాక్టర్ మీద దాడికి నిరసనగా అక్కడి వైద్య బృందం, ఆస్పత్రి సిబ్బంది ధర్నాకు దిగారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Doctor  Uttarpradesh  Sitarpur  Mob attack  Mob attack on Doctor  

Other Articles