MLA Roja Makes Controversial Comments Another Time On Chandrababu Naidu In The Case Of Cash For Vote | Special Status

Roja controversial comments on chandrababu naidu cash for vote case

mla roja, mla roja latest news, roja cleavage show, roja cleavage tattoo, roja latest controversy, roja controversy news, chandrababu naidu, roja comments chandrababu naidu, ap special status, cash for vote case

Roja Controversial Comments On Chandrababu Naidu Cash For Vote Case : MLA Roja Makes Controversial Comments Another Time On Chandrababu Naidu In The Case Of Cash For Vote.

చంద్రబాబుపై ఘాటు విమర్శ చేసిన రోజా

Posted: 09/21/2015 01:20 PM IST
Roja controversial comments on chandrababu naidu cash for vote case

విపక్ష పార్టీపై విమర్శలు చేయడంలో తానెప్పుడూ ముందుంటానని వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా మరోమారు నిరూపించుకుంది. అవకాశం దొరికితే చాలు.. టీడీపీ, చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఆమె మరోసారి సంచలన కామెంట్లు చేసింది. బాబు తన సొంత స్వలాభాల కోసం ఏపీ ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెడుతున్నారని, అందుకే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని ఆమె ఆరోపించింది. తనపై వచ్చిన ఆరోపణలు తుడిచిపెట్టుకోవడం కోసం ప్రజలకు మాయమాటలతో మభ్యపెట్టి, కేంద్రం వద్ద నాటకాలాడుతున్నారని రోజా ఘాటు విమర్శలు చేసింది.

ఈనెల 26వ తేదీన వైకాపాధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్ష కోసం ఎంపిక చేసిన దీక్షా స్థలాన్ని పరిశీలించేందుకు రోజు గుంటూరు వెళ్లింది. అక్కడికి చేరుకుని స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ నేపథ్యంలోనే ఆమె చంద్రబాబుపై ఫైరయ్యింది. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారని ఆమె పేర్కొంది. అందులో భాగంగానే ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్రాన్ని ఒత్తిడి చేయలేకపోతున్నారని ఆరోపించింది. తన సొంత ప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాల్ని బాబు కేంద్రం వద్ద తాకట్టు పెడుతున్నారని రోజా విమర్శించింది. మరి.. ఈమె కామెంట్లకు టీడీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA Roja Controversies  Chandrababu Naidu  AP Special Status  Cash For Vote  

Other Articles