rajamundry | Fire accident | rajamundry incident | pushkaralu, godavari, cm, chandrababu, fire accident

Another incident in the rajahmundry godavari pushkaralu

rajamundry, rajamundry incident, pushkaralu, godavari, cm, chandrababu, fire accident

Another incident in the Rajahmundry Godavari Pushkaralu. A fire accident near at Rajahmundry busstand. In a hotel cylinders leaked and major fire accident happened.

ITEMVIDEOS: రాజమండ్రి పుష్కర ఘాట్‌ వద్ద మళ్లీ ప్రమాదం..

Posted: 07/23/2015 08:27 AM IST
Another incident in the rajahmundry godavari pushkaralu

రాజమండ్రి గోకవరం వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను అదుపు చేసేందుకు ఫైర్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మొత్తం ఆరు పోలీసు వాహనాలు రెండు కార్లు, ఒక మినీ బస్సు దగ్ధమయ్యాయి. పుష్కరాల మొదటి రోజున జరిగిన తొక్కిసలాటలో 27 మంది ప్రజలు చనిపోయిన సంగతి తెలిసిందే. కోటి లింగాల రేవుకి దగ్గర్లోనే ఈ ప్రమాదం కూడా సంభవించింది. ఈ పుష్కర ఘాట్‌కు చేరుకునే మార్గం మధ్యలో ఉన్న హోటల్లోని సిలండర్‌లు పేలాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడికి దగ్గర్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ కూడా పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు జీపులు, కార్లు, మినీ బస్సు ప్రమాదంలో కాలిపోయాయి. సిఎం చంద్రబాబు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, సంయమనం పాటించాలన్నారు. ఏపీ డీజీపీ కూడా ఘటనా స్థలం వద్దనే ఉన్నారు. పరిస్థితి అదుపులోనే ఉందన్నారు సిఎం చంద్రబాబు.

Also Read:  పుష్కరాల్లో గాలం వేస్తే డబ్బులే డబ్బులు

గోదావరికి హరతి కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. సంఘటన జరిగనప్పుడు భక్తులంతా ఘాట్‌లలోనే ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదం సమాచారం అందిన వెంటనే రాజమండ్రిలోనే ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు, డీజీపీ చంద్రబాబు నాయుడు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. ప్రమాదానికి గల కారణాలను వారు ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో సాగిన శారద , కిళ్లీ షాపు యజమాని గొర్లె సుబ్రహ్మణ్యం , అనకాపల్లికి చెందిన వేలూరి ప్రేమ్‌కుమార్‌ గాయపడ్డారు. వీరిని 108లో హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రమాదంలో మున్సిపల్‌ కాంప్లెక్స్‌లోని బ్లీచింగ్‌ పౌడర్‌, ముగ్గు, చీపుర్లు వంటి వాటితో నిల్వలు కూడా దగ్ధమయ్యాయి

Also Read:  చంద్రబాబు షూటింగ్ వల్లే అంతమంది చనిపోయారు
Also Read:  చావులకు పరోక్షంగా బాబే కారణం అంటూ కలెక్టర్ నివేదిక..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajamundry  rajamundry incident  pushkaralu  godavari  cm  chandrababu  fire accident  

Other Articles