Fishermen | Godavari Pushkaralu | magnets, Coins, Pushkar Ghats

Fishermen idea rocks in godavari pushkaralu

Fishermen, Godavari Pushkaralu, magnets, Coins, Pushkar Ghats

Fishermen Idea rocks in Godavari Pushkaralu. Fisherman collecting the coins in the Godavari pushkar ghats by using megents..

పుష్కరాల్లో గాలం వేస్తే డబ్బులే డబ్బులు

Posted: 07/20/2015 05:05 PM IST
Fishermen idea rocks in godavari pushkaralu

గోదావరి మహా పుష్కరాల్లో జన సందోహం ఎలా ఉందో గత వారం రోజుల నుండి చూస్తేనే ఉన్నాం. తండోపతండాలుగా భక్తులు గోదావరికి పోటెత్తారు. ఇక శని, ఆది వారాల్లె అయితే ఇసకేస్తే రాలపంత జనం గోదావరిలో కనిపించారు. గోదావరిలో ఒక్కొక్క  నీటి చుక్కల్లా భక్తులు కనిపించారు. అయితే గోదావరి పుష్కరాల వల్ల అక్కడికి వచ్చిన వాళ్లకు ఆనందం, ఆధ్యాత్మిక భావం కలుగుతోంది. ఇక అక్కడే ఉంటున్న వారికి నయనానందం, వ్యాపారులకు లాభాలే లాభాలు. ఇక మరి ఎవరికీ నష్టం కలగడం లేదు అనుకుంటున్నారా..? లేదు లేదు. ఒక్కరికి మాత్రం నష్టం కలుగుతోంది. ఎవరికి అనుకుంటారా..? అది ఒక్క మత్సకారులకే.

అవును మత్సకారులు అదే చేపలు పట్టేవారు. సంవత్సరంలో 365 రోజులు గోదారమ్మను నమ్ముకున్న వారికి గోదావరి మహా పుష్కరాల కారణంగా నష్టం కలుగుతోంది. ఎందుకు అనుకుంటున్నారా..? గోదావరి పుష్కరాలు ఉన్నన్ని రోజులు నదిలోకి వెళ్లి చేపలు పట్టలేరు కాబట్టి. అయితే ఓ యాడ్ లో చూపించినట్లు ఐడియా కెన్ ఛేంజ్ యువర్ లైఫ్ అన్నట్లు.. మత్సకారుల ఓ ఐడియా కాసులు కురిపిస్తోంది. ఏంటా ఐడియా అనుకుంటున్నారా..? అదేంటంటే ఎలాగూ వేటకు వెళ్లలేరు కాబట్టి పుష్కరాలు జరుగతున్న ఘాట్ లలో చిన్న చిన్న బోట్ లు వేసుకొని తిరుగుతున్నారు. అయస్కాంతాలను పుష్కరాలకు వచ్చిన భక్తులు తమ కోరికను తీర్చాలంటూ గోదావరి తల్లికి నాణెలు వదులుతుంటారు. ఒక రూపాయి, రెండు ఐదు, పది రూపాయల నాణేలను వదలుతుంటారు. అయితే ఈ డబ్బుల మీదే మత్పకారులు దృష్టి సారించారు. చిన్న చిన్న బోట్ లలో తిరుగుతూ అయస్కాంతాలను కర్రలకు చుట్టి నీళ్లలోకి వదులుతున్నారు. అలా నీటిలోకి వదలడం వల్ల నాణేలు అయస్కాంతానికి అతుకుతున్నాయి. ఇంకేముంది వాటిని అలా ఒడిసిపట్టి... కాసుల వర్షంలో తేలుతున్నారు. అయినా తెలివి ఉండాలే కానీ ఆదాయానికి కొదువా చెప్పండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fishermen  Godavari Pushkaralu  magnets  Coins  Pushkar Ghats  

Other Articles