ఏపి కలల రాజధాని అమరావతి రూపు రేఖలు అదిరిపోయాయి. భవిష్యత్ లో ప్రపంచంలోనేి మేటి రాజధానిగా పేరు తెచ్చుకోవడానికి, దేశంలోని మిగిలిన అన్ని రాజధానులను తలదన్నేలా అమరావతి రూపుదిద్దుకోనుంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలోని బృందం ఏపీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను సీఎం చంద్రబాబుకు అందజేసింది. నిన్న హైదరాబాద్ కు వచ్చిన సింగపూర్ బృందం రాజమండ్రిలోని పుష్కరాలను సందర్శించిన తర్వాత ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అమరావతి సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ ను అందించారు. దీనిపై చంద్రబాబు నాయుడు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. పుష్కరాలు జరుగుతున్న సమయంలో సింగపూర్ మాస్టర్ ప్లాన్ ను అందించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు.
రాజధాని నిర్మాణ ప్రణాళిక అద్భుతంగా ఉందని, మాస్టర్ ప్లాన్ రూపొందించిన 30 మంది సభ్యుల సింగపూర్ బృందానికి ఏపి సిఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. పుష్కరాల సమయంలో మాస్టర్ ప్లాన్ ఇవ్వడం శుభపరిణామం అని పేర్కొన్నారు. సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అది నెరవేరుస్తామని సీఎం ఉద్ఘాటించారు. 3 లక్షల నివాస గృహాలకు అనుగుణంగా సీడ్ క్యాపిటల్ ప్రణాళిక ఉందన్నారు. బృహత్ ప్రణాళికతో 7 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశముందని వివరించారు.
నవ్యాంధ్ర రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించాలనే ఉద్దేశ్యంతో 2014 నవంబర్ 12న సింగపూర్ ప్రతినిధులను కలిశామని, డిసెంబర్ 8న సింగపూర్ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఎంవోయూ కుదిరిందని చంద్రబాబు వివరించారు. మార్చి 30న క్యాపిటల్ రీజియన్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారని.. జూన్ 20 నాటికి మూడు మాస్టర్ ప్లాన్స్ వివరాలను ఇచ్చారు అని వివరించారు. మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్‌కు తాము ఒక్కపైసా కూడా చెల్లించలేదని బాబు తెలిపారు. వారే స్వయంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారని, ఏపీప్రభుత్వం తరఫున సింగపూర్ ప్రభుత్వానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
భారత్‌లో ఇప్పటి వరకు ప్రపంచస్థాయి నగరాల నిర్మాణం కాలేదని, ఇంతగొప్ప నగరం ఏపీదే కావడం విశేషమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహాయపడాలని కోరారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 7,420 కి.మీ పరిధిలో ఏపీ క్యాపిటల్ రీజియన్ ఉంటుందని, 40 లక్షల జనాభాకు అనుగుణంగా రాజధాని అమరావతి ఉంటుందని సీఎం వివరించారు. 217 చ.కి.మీ పరిధిలో అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. అమరావతి అభివృద్ధిలో భాగస్వామిగా సింగపూర్ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జపాన్ ప్రభుత్వాన్ని కోరామన్నారు. రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించామని సీఎం చెప్పారు. అదేవిధంగా ప్రధాని మోదీ తరఫున సింగపూర్, జపాన్ ప్రధానులనూ ఆహ్వానించామన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more