Chandrababu | Harish Rao | TDP | Palamur irrigation | Mahabubnagar

Harish rao attacked on chandrababu and tdp on palamuru lift irrigation projects

Chandrababu, Harish Rao, TDP, Palamur irrigation, Mahabubnagar

Harish Rao attacked on chandrababu and tdp on Palamuru lift irrigation projects. He said that Chandrababu dont want to give irrigation water to Mahabubnagar so he opose the palamur irrigation project.

ఎత్తిపోతలకు అడ్డమొస్తే ఎత్తేసుడే: హరీష్ రావ్

Posted: 07/21/2015 08:01 AM IST
Harish rao attacked on chandrababu and tdp on palamuru lift irrigation projects

ఎత్తిపోతల పథకానికి అడ్డొస్తే, ఎత్తి అవతల పారేస్తామని తెలంగాణ టిడిపి నేతలను భారీ నీటి పారుదల శాఖమంత్రి తన్నీరు హరీష్‌రావు హెచ్చరించారు. తెలంగాణ తిండి తింటూ సీమాంధ్ర పాట పాడటం వారికే చెల్లిందని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లావ్యాప్తంగా 7.5 లక్షల ఎకరాలకు సాగు నీరం దుతుందన్నారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు సీమాంధ్ర నాయకులు శతవిధాల ప్రయత్నిస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపలేరన్నారు.

Also Read:  చంద్రబాబూ.. నీ దొంగ ప్రాజెక్టుల సంగతి ఏంటి..?

ఎత్తిపోతలకు వ్యతిరేకంగా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం, ఇటీవలే టిడిపి ఎంపి రమేష్‌ పార్లమెంటులో పాలమూరు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రశ్నించడం టిటిడిపి నాయకులకు కనిపించలేదా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టును ఆపడానికి సీమాంధ్రనాయకులు పావులు కదుపుతుండగా తెలంగాణ టిడిపి నాయకులు మాత్రం పాలమూరు ఎత్తిపోతలకు మేము వ్యతిరేకం కాదని చిలకపలుకులు పలకడం అవివేకమన్నారు.

Also Read:  తప్పదు భారీ మూల్యం: హరీష్ రావ్

కమీషన్ల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని టిడిపి నాయకులు విమర్శించడం మంత్రి హరీష్ రావ్ సరికాదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో చేసిన పనులన్నీ కమీషన్ల కోసమే చేశారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలన పారదర్శకంగా ఉందనడానికి ఈ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఆహ్వానించడమే నిదర్శనమన్నారు. పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించి రైతులతో మాట్లాడి భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినన్నారు. జిల్లా ప్రాజెక్టుల కోసం ప్రతి నెలా రెండు సార్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Also Read:  టిడిపిలో చంద్రబాబు కన్నా కేసీఆర్ సీనియర్

 అక్టోబరు, నవంబర్‌లోపు కల్వకుర్తి ఫేస్‌ 2, 3 లిప్ట్‌ ఇరిగేషన్‌ పనులను పూర్తి చేస్తామన్నారు. అంతకుముందు షాద్‌నగర్‌ పట్టణంలోని బాలబాలికల వసతి గృహాలను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. కెసిఆర్‌ పసిపిల్లల కష్టాలను గుర్తించి సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనాన్ని అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  Harish Rao  TDP  Palamur irrigation  Mahabubnagar  

Other Articles