Chandrababu | TRS | KCR | Telangana

Telangana irrogation minister harish rao fire on chandrababu

Chandrababu, TRS, KCR, Telangana, TDP,

Telangana irrogation minister Harish Rao fire on Chandrababu. Chandrababu naidu commented on trs party president and telangana cm kcr. Harish rao counter on chandrababu comments.

టిడిపిలో చంద్రబాబు కన్నా కేసీఆర్ సీనియర్

Posted: 05/02/2015 08:29 AM IST
Telangana irrogation minister harish rao fire on chandrababu

చంద్రబాబుకు వయసు మీద పడి మతితప్పిందని, అందుకే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని రాష్ట్ర భారీనీటిపారుదలశాఖ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నదని చెప్పుకునే బాబు ఇపుడు పూర్తిగా మరుగుజ్జులా మారిపోయాడని, పక్కనవాళ్లు పచ్చగా ఉంటే ఓర్వలేక కండ్లలో నిప్పులు పోసుకుంటున్నాడని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు యాదవులు, కురుమలను కించపరిచారని హరీష్ రావ్ మండిపడ్డారు. బేషరతుగా వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవడు పచ్చగున్నా బాబు ఓర్వలేడని .. కానీ ఆంధ్ర రైతులకు నీళ్లిచ్చిన మానవతావాది కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతు ఉసురు తీసింది చంద్రబాబు అని తెలిపారు.

టీడీపీ లేకపోతే కేసీఆర్ గొర్రెలు మేపుకునేవారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలమీద విరుచుకుపడ్డారు. గొర్రెలు కాసుకోవడం నీచమా..అవమానకరమా..? అని చంద్రబాబును ఆయన నిలదీశారు. యాదవులు, కురుమల వృత్తిని కించపరిచిన చంద్రబాబు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు మాటలు ఆయన మానసిక స్థితిని సూచిస్తున్నాయని అన్నారు. టీడీపీలో కేసీఆరే చంద్రబాబుకన్నా సీనియర్ అని హరీశ్‌రా వు చెప్పారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని, అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడి పోయాడని హరీశ్ చెప్పారు. ఆ తర్వాత రాజకీయంగా పుట్టగతులులేక మామపెట్టిన పార్టీలో దిక్కులేక చేరారని తెలిపారు. కేసీఆర్ 1982 లోనే టీడీపీలో చేరితే చంద్రబాబు ఏడాది తరువాత 1983లో టీడీపీలో చేరారని అన్నారు. టీడీపీలో కేసీఆరే సీనియర్ అని స్పష్టం చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  TRS  KCR  Telangana  TDP  

Other Articles