forest officials captured crocodile at balamma revu ghat in karimnagar

Crocodile in karimnagar pushkar ghat

Crocodile in Karimnagar Pushkar Ghat, Karimnagar Pushkar Ghat, Ibrahimpatnam balamma revvu ghat, devotees, Crocodile in godavari, forest officials, pushkaram survelling offivers, captured crocodile, crocodile, stampede at godavari pushkaralu, chandrababu naidu, godavari pushkaralu 2015, Telangana government, KCR

devotees ran from Ibrahimpatnam balamma revvu ghat as a devotee has witnessed a Crocodile

గోదావరి బాలమ్మ రేవు ఘాట్ లో మొసలి కలకలం

Posted: 07/16/2015 09:28 PM IST
Crocodile in karimnagar pushkar ghat

రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద తుపాకీ కలకలం మరవకముందే, కరీంనగర్ జిల్లాలో పుష్కర ఘాట్ వద్ద ఓ మొసలి కలకలం చెలరేగింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం బాలమ్మ రేవు ఘాట్ వద్ద మొసలి కనిపించడంతో భక్తులు నది బయటకు పరుగులు తీశారు. పుణ్యసాన్నాలు ఆచరించి పాప హరణం చేసుకుందామని వచ్చిన భక్తులు మొసలి వుందన్న వార్తతో ఆందోళనకు గురయ్యారు. పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

అటవీ శాఖ అధికారులు రంగప్రవేశం చేసిన మొసలిని పట్టుకున్నారు. పుష్కర ఘాట్ పక్కన దానిని ఉంచారు. బాలమ్మ రేవు పుష్కర ఘాట్‌కు పదుల సంఖ్యలో భక్తులు వచ్చారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొసలిని గుర్తించిన భక్తులు సమాచారం ఇవ్వడంతో ప్రమాదం తప్పింది.  ఒడ్డుకి వచ్చిన మొసలి చాలా చిన్నది కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మళ్ళీ కాసేపు విరామం తరువాత భక్తులు యధావిధిగా నదిలోకి దిగి స్నానాలు చేయడం మొదలుపెట్టారు. నదిలో ఒక మొసలి కనబడిందంటే లోన ఇంకా మొసళ్ళు ఉండే అవకాశం ఉందని భక్తులు భయాందోళన చెందుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : crocodile  balamma revu ghat  Ibrahimpatnam  karimnagar  

Other Articles