Nara lokesh | Rajahmundry | Godavari Pushkaralu | Pushkaralu, Ap, Chandrababu

Nara lokesh did not speak even one word about the rajahmundry incident

Nara lokesh, Rajahmundry, Godavari Pushkaralu, Pushkaralu, Ap, Chandrababu

Nara lokesh did speak even one word about the Rajahmundry incident. From the President to local leaders every one respond on that incident.

ఏం లోకేష్.. ఎక్కడ నాయనా..? స్పందించవా..?

Posted: 07/15/2015 11:22 AM IST
Nara lokesh did not speak even one word about the rajahmundry incident

రాజమండ్రి పుష్కరాల వద్ద జరిగిన విషాద ఘటన మీద అందరూ స్పందించారు. గల్లీ లీడర్ల దగ్గర నుండి ప్రధాన మంత్రి మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు అందరూ స్పందించారు. ఇక జరిగిన దారుణం మీద ప్రభుత్వంపై విమర్శలు గుప్పిన వారి జాబితా చాలా పెద్దగానే ఉంది. బాధ్యతవహిస్తు రాజీనామా చెయ్యాలని కొందరు.. మొత్తం బాధ్యత చంద్రబాబుదే అని మరికొందరు.. అంతా బాబు వల్లే అంటూ ఇంతకొందరు ఇలా రకరకాలుగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే ఇంత మంది స్పందిస్తున్నా కానీ ఒక్కరు మాత్రం బెల్లం కొట్టిన రాయిలాగా మిన్నకుండిపోయారు. ప్రమాదంలో అంత మంది చనిపోయినా కానీ నోరు తెరిచి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదుేః. ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా..? ఇంకెవరు ఏపి సిఎ: నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నేతగా చెప్పుకుంటున్న నారా లోకేష్. అవును నారా లోకేషే.

Also Read: మహా పుష్కరాల్లో మహా విషాదం.. తొలి రోజే అపశృతి

రాజమండ్రి పుష్కరాలు ప్రారంభమైన కొద్దిసేపటికే మహావిషాదం చోటచేసుకుంది. భక్తుల సంఖ్య ఊహించినదానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ రావడంతో ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని అదుపు చెయ్యలేకపోయింది. ఒక్కసారిగా భక్తులను వదిలేసరికి తీవ్ర తొక్కిసలాట జరిగింది. దాంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి 27 మంది మృతి చెందారు. ఎంతో మంది గాయాలపాలయ్యారు. దీనిపై స్పందించిన చంద్రబాబు నాయుడు ఏకంగా కన్నీరు పెట్టుకున్నారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సానుభూతి ప్రకటించారు. అయితే చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ మాత్రం స్పందించలేదు.

Also Read:  పుష్కరాలకు వెళ్లే వాళ్లూ జాగ్రత్త.. ఇవి పాటించండి

అందరికి అందుబాటులో ఉంటాను.. మీకు ఏ కష్టమొచ్చినా నేను మీకున్నాను అని మాటలే చెప్పే నారా లోకేష్ నోటి కనీసం సంతాపం అన్న మాట కూడా రాలేదు. తండ్రి కంట నీరు పెడితే కొడకు కనీసం నోటి మాట కూడా మాట్లాడరా అని కొందరు మాట్లాడుకుంటున్నారు. అయినా నారా లోకేష్ ఎక్కడున్నారు..? ఎందుకు కనీసం మాట కూడా మాట్లాడలేదు..? అన్న ప్రశ్నలకు నారా లోకేషే సమాధానం చెప్పాలి. పక్కవాడికి చెప్పే ముందు మనం సరిగా ఉన్నామా లేమా అని కూడా ఆలోచించుకోవాలి. మామూలు సమయాల్లో నోరు పారేసుకోవడం కాదు.. చనిపోయిన వారికి కనీసం సంతాపమైనా తెలపండి అంటూ కొంత మంది విమర్శకుల మాట.

By Abhinavachary

Also Read: పెరుగుతున్న మృతుల సంఖ్య.. గోదావరి పుష్కరాల్లో మహా విషాదం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara lokesh  Rajahmundry  Godavari Pushkaralu  Pushkaralu  Ap  Chandrababu  

Other Articles