YS Jagan | Jagan on babu | Chandrababu naidu | Bostha | Rajahmundry | Pushkaralu, Godavari

Ys jagan demand for resignation of ap cm chandrababu naidu to responsible for rajahmundry incident

YS Jagan, Jagan on babu, Chandrababu naidu, Bostha, Rajahmundry, Pushkaralu, Godavari

YS Jagan demand for resignation of ap cm chandrababu naidu to responsible for Rajahmundry incident. Jagan and bostha satyanarayana commented on chandrababu.

జగన్.. చావుల మీద నువ్వు మాట్లాడటం ఏంటి.?

Posted: 07/15/2015 12:50 PM IST
Ys jagan demand for resignation of ap cm chandrababu naidu to responsible for rajahmundry incident

ఎంతో రంగరంగ వైభవంగా ప్రారంభమైన గోదావరి మహా పుష్కరాల్లో మహా విషాదం చోటుచేసుకుంది. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో గోదావరి పుష్కరాలు ప్రారంభమైన మూడు గంటల్లోనే 27 మంది భక్తులు మృతిచెందడం దురదృష్టకరం. అయితే రాజమండ్రి పుష్కరాల్లో చోటుచేసుకున్న విషాదం మీద సర్వత్రా సంతాపం వ్యక్తవయింది. ఏపి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద విపక్షాల నేతలు విమర్శల వర్షం కురిపించారు. ఘటనకు బాధ్యతవహిస్తు చంద్రబాబు నాయుడు రాజీనామా చెయ్యాలని వైఎస్ఆర్పిసి నేత వైయస్ జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు నిర్లక్షం కారణంగానే అమాయక భక్తులు ప్రాణాలు వదిలారని జగన్ విమర్శించారు. అయితే జరిగిన దుర్ఘటన మీద అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ జగన్ మాట్లాడిన తీరు మీద మాత్రం విమర్శిస్తున్నారు. అయినా జగన్ మాట్లాడటమేంటి అంటూ నవ్వుకుంటున్నారు. అసలు వారు ఎందుకు నవ్వుకుంటున్నారంటే..

Also Read:  చావు రాజకీయాలు అంటే ఇవే..!

గోదావరి తీరంలో పుష్కర స్నానానికి వచ్చిన వారి మృతికి చంద్రబాబు నాయుడు కారణం అంటే వైయస్ జగన్ విమర్శించారు. రాజమండ్రి పుష్కారల్లో చోటుచేసుకున్న విషాద ఘటనకు బాధ్యతవహిస్తు సిఎం పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ తరఫున మాట్లాడిన బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు కూడా చంద్రబాబు నాయుడు మీద నిప్పులు చెరిగారు.  అయితే జగన్ మాట్లాడిన తీరు మీద కొంత మంది విమర్శకులు విమర్శిస్తున్నారు. ఓదార్పు యాత్ర పేరుతో చేసిన యాత్రల్లో తొక్కిసలాట జరిగి నలుగురు మృతి చెందితే.. తన ఓదార్పు యాత్రను మాత్రం ఆపలేదు. పైగా ఆ నలుగురు కుటుంబాలను ఓదారుస్తానంటూ మరో యాత్రకు శ్రీకారం చుట్టారు అంతే కానీ తన యాత్రను మాత్రం ఆపలేదు. అదేదో జగన్ ఓదార్పు యాత్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో ఆవశ్యకం అన్నట్లు తెగ తిరిగిన జగన్.. ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏంటా అని వారు ప్రశ్నిస్తున్నారు.

Also Read:  జ‘గన్’ పేల్చాడు.. ఆంధ్రులను దోచాడు...?

మాట మాటకు తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2007 సంవత్సరంలో గోకుల్ ఛాట్ దుర్ఘటనలో 45 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే నేనేం చేసేది అన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార రత్నం తాజాగా నీతులు చెప్పడం ఏంటో అని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో 2003లో ఎంతో రంగరంగ వైభవంగా తెలుగు వారే నివ్వెర బోయేలా గోదావరి పుష్కరాలు అంటే ఇవి అని చరిత్రలో నిలిచేలా చంద్రబాబు నాయుడు నిర్వహించిన విషయాన్ని జగన్ మరిచారా..? విజన్ లేదు.. ఎంత మంది భక్తులు వస్తారో చంద్రబాబు ప్రభుత్వం.. వచ్చిన వారికి కనీసం వసతులు కూడా కల్పించకపోవడం లేదంటూ చంద్రబాబు మీద విమర్శలు గుప్పిస్తున్న జగన్ ఒక్కసారి తన మనస్సాక్షిగా చేసిన వ్యాఖ్యల మీద పురాలోచించుకోవాలని వారంటున్నారు.

Also Read:  మా తల్లి గోదారి పిలుస్తోంది.. పుష్కరాలొచ్చె సంబరాలు తెచ్చె

జగన్ ముందు స్వామి భక్తిని చూపించుకోవడానో లేదా చాలా రోజుల తర్వాత మైక్ పట్టుకునే అవకాశం వచ్చిందనో కానీ బొత్స సత్యనారాయణ కూడా విమర్శలు గుప్పించారు. పాలెం బస్సు ప్రమాదంలో ఎంతో మంది సజీవంగా దహనమైన ఘటనకు కనీస బాధ్యతవహించి రాజీనామా చెయ్యడం మాటటుంచి.. మీద నుండి నన్నేంచెయ్యమంటారు అంటూ మీడియా వాళ్ల మీద ప్రతాపం చూపించారు. అలాంటి నేతలు కూడా నీతులు చెబుతున్నారు. అయినా చంద్రబాబు నాయుడు టైం బాగోలేదు. లేకపోతే ఇ:త లెవల్ లో ఏర్పాట్లు చేసినా దురదృష్టం వెనకాలె వచ్చింది. అందుకే టైం బ్యాడ్ అయినప్పుడు అరటిపండు తిండే కూడా పన్ను విరిగిందన్నట్లుంది చంద్రబాబు పరిస్థితి.

By Abhinavachary

Also Read:  దారులన్నీ గోదారికే.. తొలిరోజే 24 లక్షల మంది పుష్కర స్నానం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  Jagan on babu  Chandrababu naidu  Bostha  Rajahmundry  Pushkaralu  Godavari  

Other Articles