Godavari pushkaralu | Rajamandry | Precautions, Bhadrachalam, Devote

Devotes need to take precautions during the godavari pushkaralu

Godavari pushkaralu, Rajamandry, Precautions, Bhadrachalam, Devote

Heavy flot at Godavari pushkaralu in telugu states. So devotes need to take precautions during the godavari pushkaralu.

పుష్కరాలకు వెళ్లే వాళ్లూ జాగ్రత్త.. ఇవి పాటించండి

Posted: 07/14/2015 11:28 AM IST
Devotes need to take precautions during the godavari pushkaralu

గోదావరి మహా పుష్కరాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. రెండు రాష్ట్రాల సిఎంలు పుష్కరాలను ఈ ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుండి ఈ నెల 25 వ తేది వరకు పుష్కరాలు ఎంతో ఘనంగా జరగనున్నాయి. దేశవ్యాప్తంగా  ఎంతో మంది భక్తులు గోదావరి పష్కరాలకు తరలిరానున్నారు. అయితే పన్నెండేళ్లకొకసారి వచ్చే పుష్కరాలకు వెళ్లి తీరాలని చాలా మంది అనుకుంటారు. అయితే మామూలుగానే ఎక్కువ మంది భక్తులు తరలి వచ్చే గోదావరి పుష్కరాలకు వెళ్లే వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పుష్కరాలను ప్రశాంతంగా ముగించుకురావచ్చు.

జాగ్రత్తలు..
* వీలైనంత వరకు చిన్న పిల్లలను, ముసలి వారిని జాగ్రత్తగా చూసుకొండి
* షవర్ బాత్ ల వద్ద చిన్న పిల్లలకు, ముసలివారికి స్నానాలు చేయిస్తే మంచిది.
* పుష్కరాలు 25వ తేది వరకు ఉన్నాయి. కాబట్టి ముందు రోజే కాకుండా కొన్ని రోజులు ఆగి వెళ్లడం ఉత్తమం
* భక్తుల రద్దీని బట్టి.. పుష్కర స్నానానికి వెంటనే వెళ్లాలా లేదంటే కాసేపు ఆగి వెళ్లాలా అని నిర్ణయంచుకోవడం మంచిది.
* ఎలాంటి వదంతులను నమ్మవద్దు
* ఏదైనా అసౌకర్యం కలిగితే వెంటనే అక్కడున్న సిబ్బందికి సమాచారం అందించండి.
* అవసరమైతే పోలీసుల సహాయం తీసుకొండి.
* ఎక్కువ సేపు పుష్కర స్నానం చేస్తూ ఉండకండి.. స్నానం ముగిసిన వెంటనే అక్కడి నుండి బయలుదేరడం మంచిది.
* చంటి పిల్లలతో పుష్కారాలకు రాకపోవడం మంచిది.

 

Also Read: గోదావరి మహా పుష్కరాల్లో మహా విషాదం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godavari pushkaralu  Rajamandry  Precautions  Bhadrachalam  Devote  

Other Articles