KCR | Godavari Pushkaralu | Rajahmundry | DGP | Anuragsharma | Naayini Narasimha

Telangana govt revies the godavari pushkar on the incident at rajahmundry

KCR, Godavari Pushkaralu, Rajahmundry, DGP, Anuragsharma, Naayini Narasimha

Telangana govt revies the Godavari pushkar on the incident at Rajahmundry. Telangana cm KCR order to provide high level security for devotees who are attending telangana pushkaralu.

తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త. కట్టుదిట్టమైన ఏర్పాట్లు

Posted: 07/15/2015 08:25 AM IST
Telangana govt revies the godavari pushkar on the incident at rajahmundry

రాజమండ్రి ఘటనతో తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాల్లో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ అధికారులతో, నిర్వహన బాధ్యతలు వహిస్తున్న అధికారులతో సమీక్షించారు. భక్తులకు ఎలంటి ఇబ్బందులు తలెత్తకూడదు అంటూనే అదే సమయంలో  భక్తుల భద్రతకు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భద్రత ఏర్పాట్లు పరిశీలించేందుకు స్వయంగా హెలీకాప్టర్‌లో వెళ్లాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డిలను ఆదేశించారు. రాజమండ్రి ప్రమాదం నేపథ్యంలో భదత్రా ఏర్పాట్లపై సీఎం మరింత దృష్టి సారించారు.

Also Read: గంగానదికి మాత్రమే మహా కుంభమేళ.. గోదావరికి పుష్కరాలే

అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి వీలుగా భద్రాచలంలో హెలీకాప్టర్‌ను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గోదావరి మహాపుష్కరాలపై మంగళవారం ఉదయంనుంచి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తూ, పుష్కరఘాట్ల వద్ద పరిస్థితిని తెలుసుకుంటూ సమీక్షలు జరిపారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మంగళవారం ఉదయం పుష్కరాలు ప్రారంభించిన అనంతరం దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్, రెవెన్యూ కార్యదర్శి మీనా, డీఐజీ మల్లారెడ్డి తదితరులతో సీఎం సమీక్షించారు. హైదరాబాద్‌కు వచ్చిన తరువాత ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. భద్రాచలం, కాళేశ్వరంల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని, అక్కడ మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

Also Read: పెరుగుతున్న మృతుల సంఖ్య.. గోదావరి పుష్కరాల్లో మహా విషాదం

భక్తులు స్నానాలకోసం లోతు ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని, అన్ని ప్రాంతాల్లో పడవలు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. పిల్లలు, మహిళలు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పుణ్యస్నానాలు చేసేలా చూడాలని కోరారు. పుష్కరఘాట్ల వద్ద, దేవాలయాల ప్రాంగణాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. పుష్కరఘాట్లకు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

By Abhinavachary

Also Read:  పుష్కరాలకు వెళ్లే వాళ్లూ జాగ్రత్త.. ఇవి పాటించండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Godavari Pushkaralu  Rajahmundry  DGP  Anuragsharma  Naayini Narasimha  

Other Articles