Muslims' voting rights should be revoked: Sena leader Sanjay Raut

Shiv sena calls for revoking voting rights of muslims

shiv sena calls for revoking voting rights of muslims, sanjay raut slams assududdin owaisi, sanjay raut slams akbaruddin owaisi, Shiv Sena, AIMIM, Asaduddin Owaisi, sanjay raut,n sanjay raut for revoking muslims voting rigts, Shiv Sena, Sanjay Raut, Samna, AIMIM, Asaduddin Owaisi, Akbaruddin Owaisi, Maharashtra

Shiv Sena leader and Member of Parliament Sanjay Raut has stirred a hornet's nest by his article in party's mouthpiece, Saamana, in which he has written that Muslims' voting rights should be withdrawn to put an end to vote bank politics.

ముస్లింలకు ఓటింగ్ హక్కును తొలగించండి.. శివసేన ఎంపీ

Posted: 04/12/2015 06:57 PM IST
Shiv sena calls for revoking voting rights of muslims

ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీలపై శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఓవైసీ సోదరులు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ సంజయ్ విమర్శించారు. ముస్లింలు రెచ్చగొట్టి ఓవైసీ సోదరులు రాజకీయ లబ్దిపొందుతున్నారని మండిపడ్డారు. ఆదివారం శివసేన అధికారిక పత్రిక సామ్నా కు రాసిన సంపాదకీయంలో ఈ విధంగా స్పందించారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు స్వస్థి చెప్పాలంటే ముస్లింలకు ఓటు హక్కు తొలగించాలని డిమాండ్ చేశారు.

శివసేన అధ్యక్షుడు ఉద్థవ్ ఠాక్రే హైదరాబాద్ రావాలని సవాల్ విసిరిన అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. హైదరాబాద్ నగరం ఇండియాలో భాగమా? లేక లాహూర్, కరాచీ, పెషావర్ అనుకుంటున్నారా? అని సంజయ్ ప్రశ్నించారు. ఇంతకుముందు దేశం మత ప్రాతిపదికన విడిపోయినా తరువాత కూడా ఇంకా దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు జరగడం దరదృష్టకరమని అన్నారు. స్వాతంత్ర్యం తరువాత దేశంలో మైనారిటీలో జనాభా అంతకంతకూ పెరుగుతూ పోయిందన్నారు. ఈ క్రమంలో కొత్త మైనారిటీ నాయకులు పుట్టుకోస్తున్నారని సంజయ్ రౌత్ అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sanjay raut  Shiv Sena  AIMIM  Asaduddin Owaisi  

Other Articles