Telanagana minister ktr announce the govt policy on muslims

ktr, muslims, telangana, kcr, minority, reservation

telanagana minister ktr announce the govt policy on muslims. he said that the telangana govt encourage the muslims development.

ముస్లింలకు అండగా ఉంటాం: కెటిఆర్

Posted: 03/17/2015 08:56 AM IST
Telanagana minister ktr announce the govt policy on muslims

తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, అన్నిరంగాల్లో వారిని అభివృద్ధి చేసి శభాష్ అనిపించుకుంటామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలకు ప్రతి బడ్జెట్‌లో కేవలం 200 నుంచి 300 కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం వెయ్యి కోట్లకు పైగా నిధులు కేటాయించిందని వెల్లడించారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌పై ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

ఉచిత బస్‌పాస్‌ల విషయాన్ని కూడా ఆలోచిస్తామని, షాదీ ముబారక్ పథకం వంటి వాటిని అమలు చేసి ముస్లింలకు మేలు చేశామని కెటిఆర్ అన్నారు. పెన్షన్ అందుకుంటున్నవారిలో ముస్లిం మైనారిటీలు 7.5శాతం మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉర్ధూ మీడియం పాఠశాలల విస్తరణ చేపడుతామని, తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు ఎటువంటి అన్యాయం జరుగదని కేటీఆర్ హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి మీరే మెచ్చుకుంటారని అన్నారు. రిజర్వేషన్లపై మాజీ ఐఏఎస్ అధికారి చెల్లప్ప ఆధ్వర్యంలో కమిషన్ వేశామని, వక్ఫ్ బోర్డు భూములపై బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో హౌస్ కమిటీ వేశామని ఆయన వివరించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ktr  muslims  telangana  kcr  minority  reservation  

Other Articles