The best sleeping positions to sleep well

sleeping positions, best sleeping positions, health tips, sleeping positions to sleep well, healthy tips to sleep well, sleeping tips, health scientists

the best sleeping positions to sleep well : The Health scientists giving some best sleeping positions tips to sleep well and also improve our beauty.

సుఖనిద్రకోసం అనువైన చిట్కాలు...

Posted: 03/16/2015 04:12 PM IST
The best sleeping positions to sleep well

ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ లో ప్రతిఒక్కరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి, ఆఫీస్ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై వుంటారు. కొందరు రాత్రిళ్లు కూడా ఏదో పని చేస్తూనే వుంటారు. ఇటువంటివారికి సుఖనిద్ర అంటూ వుండదు. వీళ్లే కాదులెండి.. కొందరికీ ఎంతో అనువైన సమయం వున్నప్పటికీ.. సుఖనిద్ర లేక తంటాలు పడుతుంటారు. ఇలాంటివారిని దృష్టిలో పెట్టుకుని.. ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. నిద్రపట్టక సతమతమయ్యేవారి కోసం నిపుణులు కొన్ని చిట్కాలు స్లీపింగ్ పొజిషన్స్‌ను సూచిస్తున్నారు. ఇలా చేస్తే సుఖంగా నిద్రపోవడంతోపాటు ఆరోగ్యంగా వుండవచ్చునని వాళ్లు అంటున్నారు.

సుఖనిద్ర కోసం బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్...

1. రెండు చేతులూ శరీరానికి రెండువైపులా ఆచ్చి వెల్లకిలా పడుకుంటే వెన్నముకకు, మెడకూ మంచిదని అంటున్నారు. అయితే.. ఇలా నిద్రపోయినప్పుడు ఎక్కువ పిల్లోలు వాడకూడదని, లేనిపక్షంలో ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వాళ్లు హెచ్చరిస్తుననారు.

2. ఇక స్టార్‌ఫిష్ మాదిరి.. తలకింద వేసుకునే దిండుకు రెండువైపులా చేతులు పెట్టి వెల్లకిలా పడుకుంటే సుఖంగా నిద్రపోవచ్చు. ఇలా నిద్రించడం వల్ల ముఖ, చర్మ సంబంధ రుగ్మతలను నివారించవచ్చని కూడా నిపుణులు కొన్ని పరిశోధనలు జరిపిన అనంతరం వెల్లడిస్తున్నారు.

3. ‘ఫేస్ డౌన్’ స్థితిలో తలకు రెండువైపులా చేతులు పెట్టి బోర్లా పడుకుంటే.. ఎంతో హాయిగా నిద్రపోవచ్చు. ఇలా నిద్రపోవడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. అయితే మెడమీద ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. తల మరీ కిందకు వంచి నిద్రిస్తే వెన్నునొప్పి తప్పదని హెచ్చరిస్తున్నారు.

4. కొందరు బంతిమాదిరి మోకాళ్లు ముడుచుకుని ముద్దలా నిద్రిస్తుంటారు. ఇలా నిద్రపోతే మెడ, వెన్ను నొప్పికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. సాధ్యమైనంత త్వరగా ఈ అలవాటును మార్చుకుని విశాలంగా పడుకోవాలని వాళ్లు సూచిస్తున్నారు.

5. కొందరు పక్కకు తిరిగి పడుకుంటారు. ఇలా నిద్రిస్తే.. చర్మం త్వరగా ముడతలు పడవచ్చునని, తద్వార అందవిహీనంగా మారుతారని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ పొజిషన్ లో పడుకోకుండా వుండేలా జాగ్రత్త పడితే మంచిది.

6. నిటారుగా రెండు చేతులు, కాళ్లు చాచి పడుకోవడం వల్ల బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ తగ్గుతాయి. ఫలితంగా ఎంతో సుఖంగా నిద్రపడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : best sleeping positions  sleeping tips  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more