Bajrang ouwitted by Aliev, to fight for bronze రెజ్లింగ్ సెమీస్ లో భజరంగ్ పునియా ఓటమి

Tokyo olympics 2020 wrestler bajrang punia loses to haji aliyev in semis

Bajrang Punia, semi-final bout against haji aliyev, Tokyo Olympics,Bajrang Punia,semi-final bout against haji aliyev,Tokyo Olympics,medal contenders in tokyo 2020,wrestler bajrang punia,star indian wrestler bajrang punia, Tokyo Olympics 2020, Wrestling, freestyle wrestling, Wrestling, Indian Wrestlers, wrestling news, india wrestling, Sports, Olympics updates, Semi Finals, Sports, Tokyo Olympics

IStar Indian wrestler Bajrang Punia, one of the medal contenders in Tokyo 2020, lost his semi-final bout against Haji Aliyev from Azerbaijan in the semifinal. Bajrang will now play the bronze medal bout on August 7.

రెజ్లింగ్ సెమీ ఫైనల్స్ లో భజరంగ్ పునియా ఓటమి

Posted: 08/06/2021 08:07 PM IST
Tokyo olympics 2020 wrestler bajrang punia loses to haji aliyev in semis

టోక్యో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరేలా ధీమాగా కనిపించిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా.. సెమీస్ లో నిరాశపరిచాడు. రెజ్లింగ్ పునియా దేశానికి స్వర్ణం తీసుకోస్తాడని ఆశించిన భారతీయ అభిమానులు నిరాశకు లోనయ్యారు, ఫురుషుల 65 కేజీల రెజ్లింగ్ విభాగంలో ఇవాళ అజర్‌బైజాన్ రెజ్లర్ హజీ అలియేవ్‌తో సెమీస్‌లో తలపడిన బజరంగ్ పునియా 5-12 తేడాతో పేలవరీతిలో ఓడిపోయాడు. దాంతో.. ఫైనల్ ఆశలకి తెరపడగా.. కాంస్య పతకం కోసం బజరంగ్ ఫైట్ చేయనున్నాడు.

వాస్తవానికి ఈరోజు సెమీస్ మ్యాచ్‌లో బజరంగ్ పునియానే తొలుత పాయింట్ల ఖాతాని తెరిచాడు. హజీ అలియేవ్‌ ఆరంభంలోనే నిబంధనల్ని అతిక్రమించడంతో బజరంగ్‌కి ఒక పాయింట్ లభించింది. కానీ.. బజరంగ్ రెండు కాళ్లని ఒడిసిపట్టుకున్న అలియేవ్‌ రెండు సార్లు బజరంగ్‌ని తిప్పేశాడు. దాంతో.. అతని ఖాతాలో ఒక్కసారిగా నాలుగు పాయింట్లు చేరాయి. ఆ తర్వాత కూడా డబుల్ లెగ్ అటాక్‌తో బజరంగ్‌ని అలియేవ్‌ ఇబ్బందిపెట్టాడు. మొత్తంగా 8-1తో ఆధిక్యంలోకి వెళ్లిన అలియేవ్‌.. చివర్లో చక్కగా డిఫెన్స్ చేశాడు. ఆఖర్లో డబుల్ లెగ్ అటాక్ కోసం వెళ్లిన జబరంగ్‌.. తనే ప్రత్యర్థికి దొరికిపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles