Tokyo Olympics: Ravi Kumar wins silver in wrestling కాంస్యంతో సరిపెట్టుకున్న రవి.. రెజ్లింగ్ ఫైనల్స్ లో ఓటమి

Tokyo olympics ravi dahiya takes home olympic silver goes down fighting in final

Ravi Kumar Dahiya, Sanayev Nurislam (Kazakhstan), Semi-Finals, Finals, Zavur uguev, Russia, World Wrestling Champion, Tokyo Olympics 2020, Wrestling, freestyle wrestling, Wrestling, Indian Wrestlers, wrestling news, india wrestling, Sports, Olympics updates, Semi Finals, Sports, Tokyo Olympics

India's Ravi Kumar Dahiya bags silver medal in the men’s 57kg freestyle event after a 4-7 loss to Russia’s Zavur Uguev in the final. Ravi becomes the second Indian wrestler, after Sushil Kumar, to win the silver medal at the Olympic Games and a fifth wrestler to bag an Olympic medal.

టోక్యో ఒలంపిక్స్: ఫైనల్స్ లో రవి ఓటమి.. కాంస్యాన్ని అందించిన రెజ్లర్

Posted: 08/05/2021 05:47 PM IST
Tokyo olympics ravi dahiya takes home olympic silver goes down fighting in final

టోక్యో ఒలింపిక్స్ లో భార‌త రెజ్ల‌ర్ ర‌వి కుమార్ ద‌హియా రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్స్ లో ఆయన విజయం కోసం ఎధురుచూసిన ప్రతీ భారతీయుడి ఆశలను ఆయన అందుకోలేకపోయాడు. తుదిపోరులో రష్యాకు చెందిన ప్రస్తుత ప్రపంచ చాంఫియన్ జవూర్‌ ఉగుయెవ్ తో విరోచిత పోరాటం చేసినా చివరకు ఓటమిని చవిచూడక తప్పలేదు. 57 కేజీల మెన్స్ ఫ్రీస్ట‌యిల్‌ ఫైనల్స్ లో దహియా పోరాటం వీరోచిత పోరాటానికి భారతీయులు గర్వపడుతున్నారు.

టోక్యో ఒలంపిక్స్ లో భాగంగా 57 కేజీల రెజ్లింగ్ ఫైనల్స్ హోరాహోరీగా సాగాయి, ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో రవి దహియా పోరాడి ఓడినా.. భారతీయుల గుండెల్లో మాత్రం ఓడి గెలిచాడు. భరతమాత సిగలో ఆయన రజత పతకాన్ని పెట్టాడు. దీంతో భారత్ ఖాతాలో మరో వెండి పతకం వచ్చిచేరింది. రెండుపార్లు ప్రపంచ ఛాంఫియన్ గా నిలిచిన రెజ్లర్ జవూర్ ఉగుయేవ్  చేతిలో 7-4 తేడాగా ఓటిమిపాలయ్యాడు. కాగా ఆయన సాధించిన రజతం..  స్వర్ణం కన్నా విలువైనదేని క్రీడాలోకం ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రపంచ చాంఫియన్ ఎదుట నిలబడినా.. గెలుపు కోసం తుది వరకు ప్రయత్నించిన రవికుమార్ దహియాపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, క్రీడాశాఖ మంత్రి, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా ప్రముఖులు ఆయనకు ట్విట్టర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ప్రధాని ట్వీట్‌ చేస్తూ.. ‘రవి కుమార్‌ దహియా అద్భుతమైన ఆటగాడు. అతను కనబరిచిన స్ఫూర్తి అద్భుతం. వెండి పతకం గెలిచుకున్నందుకు రవి కుమార్‌కు శుభాకాంక్షలు’ అని పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles